telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

క్వీన్ కంగనా “పంగా” మూవీ ట్విట్టర్ టాక్

panga

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన “పంగా” సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను అశ్వినీ అయ్యర్ తివారీ తెరకెక్కించారు. జస్సీ గిల్, రిచా చద్దా, నీనా గుప్తా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమ కథేంటంటే… జయ (కంగన) జాతీయ స్థాయిలో ఛాంపియన్‌గా పేరు తెచ్చుకుంటుంది. కానీ పెళ్లై, ఓ బిడ్డకు జన్మనిచ్చాక ఆ గుర్తింపు అంతా పోతుంది. అప్పటిదాకా చప్పట్లతో ఎంకరేజ్ చేసిన జనాలు పెళ్లయ్యాక మాత్రం కనీసం పలకరించడం మానేస్తారు. కానీ జయకి మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఛాంపియన్‌షిప్ సాధించాలని ఉంటుంది. ఇందుకోసం తన ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తుంది. అలా ఓ పక్క కుటుంబాన్ని చూసుకుంటూనే మరోపక్క అంతర్జాతీయ కబడ్డీ పోటీలకు సన్నద్ధం అవుతుంది. మరి చివరకు జయ అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ టైటిల్‌ను అందుకోగలిగిందా ? అన్నది తెరపై చూడాల్సిందే. ఈ సినిమా ప్రతి ఒక్కరి హృదయాలను తాకుతుందని, కంగనా రనౌత్ పెర్ఫామెన్స్‌కు హ్యాట్సాఫ్ అని, బాలీవుడ్ నటి రిచా చద్దా కూడా కబడ్డీ క్రీడాకారిణిగా చాలా బాగా నటించారని ఓ రేంజ్ లో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు ఇప్పటికే సినిమాను వీక్షించిన జనాలు. అదే నిజమైతే బాలీవుడ్ క్వీన్ ఖాతాలో మరో భారీ హిట్ పడడం ఖాయం.

Related posts