ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం స్మ గ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’ పేరుతో డిసెంబర్ 17న ఈ చిత్రం విడుదలవుతోంది.
పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ లుక్, గెటప్, బాడీ లాంగ్వేజ్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. రష్మిక మునుపెన్నడూ లేని విధంగా పల్లెటూరి యువతి పాత్రలో అందాలు ఆరబోస్తోంది.
విడుదల సమయం దగ్గర పడుతుండడంతో హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ సమంతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘సమంత గారికి థ్యాక్స్ చెప్పాలి. స్పెషల్ సాంగ్‌లో నటించేందుకు నాయికలకు కొన్ని పరిమితులు ఉంటాయి.
అయినా మా సినిమాలో చేయమని అడగ్గానే ఒప్పుకున్నారు. తను నమ్మినా నమ్మకపోయినా మేము ఏది అడిగితే అది వచ్చి చేసింది. సైలెంట్‌గా వెళ్లిపోయింది. తన పాత్రకు న్యాయం చేసింది. ఈ సందర్భంగా సమంతకు సభాముఖంగా సమంతకు ధన్యవాదాలు చెబుతున్నాను’ అంటూ బన్నీ చెప్పుకొచ్చాడు.
కాగా.. అల్లు అర్జున్ అభిమానులతో ప్రీ రిలీజ్ ప్రాంగణం అంతా జనసంద్రాన్ని తలపిస్తోంది. అల్లు అర్జున్ నినాదాలతో ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు. ప్రీ రిలీజ్ వేడుకకు రాజమౌళి, కొరటాల శివ లాంటి స్టార్ డైరెక్టర్స్ అతిథులుగా హాజరయ్యారు. రష్మిక మందన బ్లాక్ శారీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైంది.
భయపడి బయటకు రాలేదు… ఇప్పుడా బాధ లేదు : సమీరా రెడ్డి