telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీకి మరో ఎదురుదెబ్బ.. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామ!

tdp mla pulaparthi may quit tdp

సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో వలసలు ఊపందుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పచ్చిమ గన్నవరం నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. స్థానికేతరుడు అయిన స్టాలిన్ బాబుకు ఇవ్వడంతో అలకబూనిన పులపర్తి ఆ పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పులపర్తి నారాయణ మూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా లేక జనసేన తీర్థం పుచ్చుకుంటారా అన్నది ఈ రోజు తెలియనుంది.

తన స్థానంలో పులపర్తి ప్రాతినిథ్యం వహిస్తున్న పచ్చిమ గన్నవరం నియోజకవర్గం టికెట్ ఆయనకు కాకుండా నేలపూడి స్టాలిన్ బాబుకు ఇవ్వడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారు. ఇకపోతే పులపర్తి అనుచరుల్లో కొంతమంది జనసేన పార్టీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నియోజకవర్గంలోని మరో సిట్టింగ్ ఎమ్మెల్యే క్యాడర్, ముఖ్యంగా ఎమ్మెల్యే అనుచరులు జనసేనలోకి వెళ్లిపోయారు. 

టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పులపర్తి నారాయణ మూర్తి 1994 ఎన్నికల్లో నగరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.  2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికొండేటి చిట్టిబాబుపై 13505 ఓట్ల మెజారిటీతో పులపర్తి నారాయణ మూర్తి విజయం సాధించారు.

Related posts