telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఒంటె పాలు .. శ్రేష్టమైనవి..

camel milk and its health secrets

పాలు, వాటితో తయారుచేసిన ఉత్పత్తులకు గిరాకీ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఏమంటే ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకోబోయే వరకు దాదాపు అన్ని వయసుల వారికి ఇది అవసరం. ఎందుకంటె, ఇది ఒక సంపూర్ణ ఆహారం. మిగిలినవి ఏవి తీసుకోకపోయినా, పాలు మాత్రం తీసుకుంటే అన్ని పోషకాలు శరీరానికి అంది, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చు. అందుకే పాలు కానీ, దానితో తయారు చేసిన పదార్దాలకు గాని అంత గిరాకీ. అయితే ఈ పాలు కూడా అనేక రకాలుగా దొరుకుతాయి. అందులో గేదెపాలు, ఆవు పాలు, ఇంకొంచం తెలిసిన వారికి మేకపాలు తెలుసు. ఎవరికి లభ్యమైనవి వారు తీసుకుంటుంటారు. ఇక ఎడారిలో ఉండేవారి గురించి ఆలోచిస్తే, వారికీ అందుబాటులో ఉండే పాలు ఉన్నాయి, అవే ఒంటె పాలు. ఈ పాలు కూడా ఎంతో శ్రేష్టం అంటున్నారు వైద్యులు. ఈ పాలు ఇంకా దొరికే రూపాల విషయానికి వస్తే, సోయా పాలు, బియ్యంపాలు, కొబ్బరి పాలు ఇలా జంతువుల పాలకు ప్రత్యామ్నాయంగా ఎన్నో రకాల పాలు కూడా మనకిప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో తల్లిపాలతో సరిపోయే పోషకాలున్న జంతువుల పాలు దొరకడం అరుదు. అయితే ఒంటె పాలు మాత్రం సాధారణ జంతువుల పాలకు భిన్నంగా తల్లిపాలలో ఉండే పోషకాలకు దగ్గరగా ఉంటాయి.

* సాధారణ పాలతో పోలిస్తే ఒంటె పాలలో సంతృప్తకొవ్వు ఆమ్లాలు, కొలెస్ట్రాల్‌, చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఒమేగా-3ఫాటీ ఆసిడ్స్‌, మోనో అన్‌శాచ్యురేటెడ్‌ ఫ్యాటీ ఆసిడ్స్‌ ఎక్కువగా ఉంటాయి.

* ఇందులో కావల్సిన స్థాయిలో మెగ్నీషియం, జింక్‌, ఐరన్‌ వంటి ఖనిజలవణాలు ఉంటాయి. విటమిన్‌ సి, బీ2, ఏ, ఈ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

* లాక్టో ఫెరిన్‌ వంటి ప్రొటీన్‌, లాక్టోపెరాక్సిడేజ్‌, ఇమ్యునోగ్లోబ్యులిన్‌, లైసోజైమ్స్‌ వంటివి ఉంటాయి. ఇందులో యాంటీ యాక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌, యాంటీ ఫంగల్ గుణాలున్నాయి.

* భారత్‌ వంటి దేశాల్లో ఒంటె పాలను థెరపాటిక్‌ డైట్‌లలో భాగం చేస్తున్నారు. టీబీ, జాండిస్‌, రక్తహీనత, ఆటిజం, మధుమేహం వంటి వ్యాధుల బాధితులకు దీన్ని తమ ఆహారం లో భాగంగా చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోగనిరోధక శక్తికి సంబంధించిన వ్యాధులున్న వారు వీటిని ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే సహజసిద్ధమైన ప్రొటీన్‌ మధుమేహం ఉన్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది.

ఒంటె పాలు అందరికీ అందుబాటులో ఉండకపోచ్చు. కానీ వీటికి ప్రత్యామ్నాయంగా మంచి ప్రొటీన్లతో కూడిన ఆహారాన్ని దైనందిన మెనూలో చేర్చుకోవచ్చు. తాజా కూరగాయలు, ఆకుకూరలు, కాలానుగుణంగా దొరికే పండ్లని ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు సహజసిద్ధంగానే లభిస్తాయి.

Related posts