telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ : .. తాసిల్దార్లకు ఆర్టీసీ బాధ్యతలు .. సాయంత్రం వరకూ డెడ్ లైన్..

funds to telangana by central govt

రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సమ్మెపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. శనివారం సాయంత్రం ఆరు గంటల లోపు ఆయా ఆర్టీసీ డిపోల్లో రిపోర్టు చేసిన వారిని మాత్రమే ఇకపై ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తిస్తామని, విధులకు రాని వారిని తమంతట తాము ఉద్యోగాలు వదిలిపెట్టిన వారిగా పరిగణిస్తామని హెచ్చరించింది. డ్యూటీకి వచ్చే కార్మికులకు పూర్తి స్థాయిలో రక్షణ,ఉద్యోగ భద్రత కల్పిస్తామని..రాని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఉద్యోగంలో చేర్చుకోబోమని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో విధాన నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రకటించింది. ఇకపై కార్మిక సంఘాలతో ఎలాంటి చర్చలు జరపవద్దని నిర్ణయించింది. దీంతో కార్మికులతో చర్చల కోసం నియమించిన సీనియర్ ఐఏఎస్ ల కమిటీ కూడా రద్దయిపోయింది.ఇక ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్..శుక్రవారం రాత్రి హైదరాబాద్​కు తిరిగి రాగానే ఆర్టీసీ సమ్మెపై ప్రగతిభవన్​లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.ఇక పండుగల సందర్భంగా వచ్చే ఆదాయం ఎంతో కొంత ఉపయోగపడే పరిస్థితుల్లో యూనియన్లు సమ్మెకు పిలుపునివ్వడం పట్ల సీఎం కేసీఆర్​ అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

ఆర్టీసీ ఉద్యోగులు అక్టోబర్ 5 శనివారం ఉదయం నుంచి సమ్మెకు వెళ్తుండటంతో, ప్రభుత్వం ప్రత్యాన్మాయ చర్యలపై దృష్టిపెట్టింది. పండుగవేళ ప్రజా రవాణా వ్యవస్థను యధావిధిగా నడిపించాలన్న ఉద్దేశంతో..ట్రాన్స్ పోర్ట్ డిపార్టుమెంట్,రెవెన్యూ డిపార్టుమెంట్ అధికారులకు అత్యవసర బాధ్యతలను అప్పగిచింది. MROలకు ఆర్టీసీ బాధ్యతలను కూడా అదనంగా అప్పగించడంతో పాటుగా,తహశీల్దార్లను నోడల్ అధికారులుగా నియమిస్తూ,హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. బస్సులను అవసరానికి అనుగుణంగా నడిపించడంలో ఎమ్మార్వోలు డిపో మేనేజర్లతో కలిసి పనిచేయాలని సూచించారు. ఏది ఏమైన ఇప్పుడు ప్రయాణికుల పరిస్దితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైందని ప్రయాణం కోసం అన్ని సిద్ధం చేసుకున్న వారు వాపోతున్నారు. అందులో పట్నంకు వలస వచ్చిన కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసుకొని లగేజి సర్దుకొని పిల్లపాపలతో బస్టాండ్‌ల్లో ఎదురు చూస్తున్నారు.

Related posts