telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బీజేపీ హాకింగ్ చేసింది..వారి టెక్నాలజీని మేము హ్యాక్ చేయలేకపోయాం.. : షుజా

shuju truth reveal on bjp scam in 2014

గత ఎన్నికలలో బీజేపీ అనధికార పనులకు పాల్పడి, గెలుపు సొంతం చేసుకున్నట్టు వార్తలు సామాజిక మాధ్యమాలలో ప్రచారం జోరుగా సాగుతుంది. తాజాగా 2014 ఎన్నికల కు ఈవీఎంలను రూపొందించిన సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా ఆరోపించారు. సాధారణ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, ఢిల్లీ ఫలితాలను రిగ్గింగ్ చేయడం జరిగిందని షుజా స్పష్టం చేశారు. బీజేపీ ఈవీఎంలను హ్యాకింగ్ చేసిందని తెలిపారు. మిలటరీ గ్రేడ్ ఫ్రీక్వెన్సీని విడుదల చేసే మాడ్యులేటర్ తో బీజేపీ ఈవీఎంలను హ్యాకింగ్ చేసిందన్నారు.

లోక్ సభ ఎన్నికలలో వాడిన ఈవీఎంల నుంచి సిగ్నల్స్ వస్తున్నట్టు ఏప్రిల్ 2014 తాను గుర్తించినట్టు సయ్యద్ షుజా చెప్పారు. 2009-2014 సమయంలో తాను ఈసీఐఎల్ లో పనిచేసినట్టు సయ్యద్ షుజా తెలిపారు. 2014 ఎన్నికలలో వాడిన ఈవీఎంలను రూపొందించిన బృందంలో తాను సభ్యుడిగా పనిచేసినట్టు షుజా తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న షుజా లండన్ నుంచి ఈవీఎంలను హ్యాకింగ్ చేయడాన్ని ప్రదర్శించారు. ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (యూరప్) లండన్ లో ఏర్పాటు చేసిన ఈవీఎం హ్యాకింగ్ ప్రదర్శనకు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఈవీఎంలను వినియోగించిన ఎన్నికలలో ఎక్కడ మెషీన్లను ట్యాంపర్ చేశారో తాను గుర్తించగలనని అన్నారు.

ఈవీఎంలను బ్లూటూత్ తో హ్యాక్ చేయడం సాద్యం కాదని షుజా వివరించారు. ఈవీఎంను హ్యాక్ చేసి ప్రవేశించేందుకు గ్రాఫైట్ ఆధారిత ట్రాన్స్ మిటర్ అవసరం అవుతుందని తెలిపారు. ఈవీఎంలలోని డేటాను మార్చేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నారని షుజా అన్నారు. వారు లో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ మిషన్ ద్వారా సిగ్నల్ ని అడ్డుకొనేందుకు ప్రయత్నించారని చెప్పారు. ప్రధాన ఎన్నికల కమిషనర్లంతా ఈవీఎంలను వైర్ లెస్ గా చేరుకోవడం సాధ్యం కాదని తనతో చెప్పారని కానీ పెరుగుతున్న టెక్నాలజీతో ఇది సాధ్యమేనన్నారు. 7హెర్ట్జ్ వంటి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉండే మాడ్యులేటర్ ను ఉపయోగించి ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని చెప్పారు. బీజేపీ ఐటీ విభాగం దగ్గర ఒక ప్రోటోటైప్ ఉందని, ఆ మెషీన్ ను తాము సైతం హ్యాక్ చేయలేకపోయామని తెలిపారు.

Related posts