telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సోనాక్షితో డేటింగ్ లో లేను : జహీర్‌ ఇక్బాల్‌

sonakshi

బాలీవుడ్‌ నటుడు జహీర్‌ ఇక్బాల్‌ గత కొంతకాలంగా సోనాక్షి సిన్హాతో డేటింగ్‌లో ఉన్నట్లు వస్తున్న పుకార్లను ఖండించాడు. దీనిపై ఓ ఇంటర్యూలో జహీర్‌ స్పందిస్తూ ‘నేను సోనాక్షి ప్రేమలో ఉన్నామంటు వచ్చిన వార్తలను చదివి మేమిద్దరం నవ్వుకున్నాం. తరచూ ఇద్దరం కలిసి వివిధ పార్టీలకు, డిన్నర్‌లకు వెళ్లేవాళ్లం. అది చూసి అంతా సోనాక్షి, నేను డేటింగ్‌లో ఉన్నామని భావించి ఉంటారు. నాకు తెలిసి అందువల్లే ఈ పుకార్లు పుట్టుకొచ్చి ఉంటాయి. ఇక తమపై వచ్చిన పుకార్లను చూసి సోనాక్షి, తాను చర్చించుకున్నామని చెప్పాడు. ఇక అందరికి తెలియని విషయం ఏటంటే తాను అప్పటికే మరొకరితో ప్రేమలో ఉన్నానని చెప్పాడు. ఆ విషయం సోనాక్షికి కూడా తెలుసని, దీంతో తమపై వచ్చిన ఈ రూమర్‌ వల్ల సోనాక్షి చాలా ఇబ్బంది పడిందన్నాడు. అయితే ప్రస్తుతానికి తాను సింగిల్‌గా ఉన్నానని చెప్పాడు. కాగా జాహీర్‌​ గతేడాది దర్శకుడు నితిన్‌ కక్కర్‌, రూపొందించిన ‘నోట్‌బుక్‌’ సినిమాతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేశాడు.

Related posts