telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సోనూసూద్‌ని అమితాబ్‌తో పోల్చిన నెటిజన్… ఆయన రియాక్షన్…!

Sonusood

లాక్‌డౌన్ స‌మ‌యంలో బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ తిండితిప్ప‌లు లేక ఇబ్బందులు పడుతున్న వ‌ల‌స కార్మికుల కోసం ప్ర‌త్యేకంగా బ‌స్సులు వేసి సొంత రాష్ట్రాల‌కి తరలించిన విషయం తెలిసిందే. సోనూసూద్ చేస్తున్న‌ సేవా కార్య‌క్ర‌మాల‌పై కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీ కూడా ప్రశంస‌లు కురిపించారు. తాజాగా ఓ నెటిజ‌న్ సోనూసూద్‌ని అమితాబ్‌తో పోల్చాడు. అమితాబ్ ఇంటికి ప్ర‌తి ఆదివారం అభిమానులు ఎలా వ‌స్తారో ఇక నుండి మీ ఇంటి ముందు కూడా ప్ర‌జ‌లు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతారు. ముంబైకి వ‌చ్చే టూరిస్ట్‌లు సోనూసూద్ ఇల్లు ఎక్క‌డ అని అడుగుతారు. ఇక నుండి ఆదివారం మీరు షూటింగ్‌లు చేయకండి అని స‌ల‌హా ఇచ్చాడు. దీనికి స‌మాధానంగా సోనూసూద్‌.. వాళ్ళు ఎందుకు మా ఇంటికి వ‌స్తారు? నేనే వారి ద‌గ్గ‌ర‌కి వెళతాను. వారు నాకు చాలా ఆలూ పరోటా, పాన్, టీ రుణపడి ఉన్నారు అని బ‌దులిచ్చారు

Related posts