telugu navyamedia
ఆరోగ్యం

రేగుపండ్లు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు..

శీతాకాలంలో విరివిగా వచ్చే పండ్లలో రేగుపండ్లు ముఖ్యమైనవి. రేగుపండ్లు తినడం చాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని జిజిఫుస్ మారిటియానా, నార్‌కెలి కల్, బెర్, బోరీ, బోర్, బెరి అని అనేక రకాల పేర్లతో వివిధ ప్రాంతాల్లో పిలుస్తారు. ఇక శరీరానికి చక్కటి పోషకాలు అందించడంలో రేగుపండ్లు బాగా ఉపయోగపడతాయి. ఈ మినరల్స్ గుండె ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవసరం. అంతేకాక రక్తంలో హిమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్ అవసరం ఎంతయినా ఉంది.

రేగు పండ్ల వలన రక్త హీనత సమస్య తగ్గుతుంది. రక్త ప్రసరణ సాఫీగా జరగాలన్న కూడా రేగు పండ్లు శరీరానికి చాలా అవసరం. ఇక ఎండిన రేగు పండ్లలో కాల్షియం, పాస్పరస్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఎముకలు దృఢంగా వుండేందుకు ఇవి చాల అవసరం. అంతేకాక ఆర్థరైటిస్ సమస్యతో బాధ పడేవారు ఈ పండ్లు తినడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. కీళ్లకి సంబంధించిన సమస్యలు ఉన్నవారు ఈ పండ్లు తింటే చాల మంచిది.

రేగిపండ్లు ఒత్తిడి తగ్గించడంలో కూడా బాగా పనిచేస్తాయి. దీనిలో ఒత్తిడిని తగ్గించే గుణాలు ఎక్కువ..ఇవి చర్మ ఆరోగ్యాన్ని పెంచి యవ్వనంగా ఉంచుతాయి. చర్మం ముడతలు పడడం తగ్గుతుంది. మల బద్ధకం ఉన్నవారికి రేగిపండు చాలా మంచిది. అయితే రేగుపండ్లను రోజూ తింటే ఆ సమస్య చాలావరకు తగ్గిపోతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా రేగు పండు మంచి ఆహారం. ఇవి ఎన్ని తిన్నా బరువు పెరగరు. కొవ్వు ఉండదు, ఇందులో ఉండే కెలరీలు చాలా తక్కువ.. శరీరానికి వెంటనే శక్తి వస్తుంది.

మనిషికి శరీరానికి అవసరమైన 24 రకాల ఆమైనో ఆమ్లాలలో 18 రకాలు ఒక్క రేగు పండ్లలోనే లభిస్తాయి. వీటితో కడుపుమంట, ఆజీర్తి, గొంతునొప్పి, అస్తమా, కండరాల నొప్పి తగ్గుతాయి. అంతేకాక గర్భిణుల్లో ఉండే వికారాలను వాంతులు, తగ్గిస్తుంది. మూత్రపిండాలు, ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫంను బయటకి పంపి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. కాబట్టి వయస్సుతో సంబంధం లేకుండా ఏ సీజన్లో దొరికె పళ్ళు ఆ సీజన్లో తినడం అందరికి మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Related posts