telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఇలా చేస్తే అల్సర్‌ సమస్య మాయం..

ఆహారాన్ని నమలకుండా అమాంతం మింగడం; గ్యాస్‌తో నిండిన కూల్‌డ్రింకులను, సోడాలను తాగడం; పొగాకు, కిళ్లీలు, చాక్లెట్లు, బబుల్‌గమ్‌లూ మొదలైన వాటిని అదే పనిగా నములుతుండటం; మసాలా పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం ఇటువంటి వాటి వల్ల ఆమాశయంలోకి వాయువు ఎక్కువగా ప్రవేశిస్తుంది. ఈ కారణాలను అలా ఉంచితే, కొన్నిసార్లు ఆందోళన, భయం, ఉద్వేగం వంటి మానసిక కారణాలు సైతం గ్యాస్‌ తయారీకి దోహదపడతాయి. అలాగే కొన్ని సందర్భాల్లో పేగుపూత, అల్సర్లు, శరీరంలో నీరు శోషణ చెందటం (డీహైడ్రేషన్‌) మొదలైన స్థితులు కూడా గ్యాస్‌కు కారణాలుగా నిలుస్తాయి.
1. ఆహారం_పడకపోవటం (ఫుడ్‌ ఎలర్జీ)
చాలామంది పేషెంట్లు తాము ప్రత్యేకంగా ఆహారమేదీ తీసుకోవడం లేదనీ, అయినా ఎందుకనో గ్యాస్‌ ఎక్కువగా తయారవుతోందనీ అంటుంటారు. అయితే అకారణంగా గ్యాస్‌ తయారవడమనేది సాధారణంగా జరగదు. గ్యాస్‌ తయారు కావడానికి ఆహారపరమైన కారణాలే ముఖ్యమైనవి.
#నవీన్_సూచనలు : మాట్లాడుతూ తినకూడదు. ప్రతి ముద్దనూ నింపాదిగా నమిలి తినాలి. క్యాబేజీ, ఉల్లిపాయ, యాపిల్స్‌, అరటిపండు, ముల్లంగి, గోధుమపిండి, మినుములు, కోడిగ్రుడ్లు… ఇటువంటి వాటి వల్ల గ్యాస్‌ ఎక్కువగా తయారవుతుంది కనుక వీటి వాడకాన్ని తగ్గించాలి. టీ, కాఫీలను ఎక్కువగా మరిగించడం వలన లేదా వీటిల్లో పంచదార ఎక్కువగా కలపడం వల్ల గ్యాస్‌ ఉత్పన్నమౌతుంది. తీపి పదార్థాలు ప్రేవులలోకి వెళ్లి త్వరగా పులిసిపోతాయి. ఫలితంగా వీటినుంచి గ్యాస్‌ వెలువడుతుంది
#గృహచికిత్సలు : 1) కడుపు ఉబ్బరింపు వలన ఏ అర్థరాత్రో మీకు మెళకువ వచ్చి, గుండె ప్రాంతమంత్లుంటే, ు కుదురుగా చుట్ పెనం మీద వేడి చేసి ఉదర ప్రాంతంలో కావడం పెట్టుకోండి. దీనితో ఉదర ప్రాంతపు కండరాలు సడలి ఉబ్బరింపు తగ్గుతుంది.
2) డుపు ఉబ్బరింపు ఉన్నప్పుడు ఒక గ్రాము అల్లంలో చిటికెడంత ఉప్పును కలిపి రెండుపూటలా తీసుకుంటే కూడా చక్కని ఫలితం ఉంటుంది.
3) వాము (నాలుగు ి (రెండు భాగాలు), నల్ల ఉప్పు (ఒక భాగం), శంఖ భస్మం భాగం) వీటన్నిటినీ కలపండి. ఈ మిశ్రమాన్ని అరచెంచాడు చొప్పున ఒక కప్పు వేడి నీటితో కలిపి తీసుకోవాలి.
4) త్రిఫలా చూర్ణం (కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ), త్రికటు చూర్ణం ఈ రెండింటిని కలుపగా తయారైన మిశ్రమాన్నుంచి ఒక చెంచాడు చూర్ణాన్ని డికాక్షన్‌ కాచుకుని తాగాలి.
#ఔషధాలు : మహాశంఖవటి, హింగ్వాష్టక చూర్ణం.
2. #కడుపునొప్పితో_కూడిన_మలవిసర్జన (#ఇరిటబుల్‌_బొవెల్‌_సిండ్రోమ్)
దీనిలో ప్రత్యేక లక్షణం కడుపు నొప్పి మలవిసర్జనతో కొంత తగ్గినట్లనిపించడం. ఒక్కొక్కసారి ఆహార సేవనతో ఎక్కువవుతుంది. మలం రిబ్బన్‌లాగా వెడల్పుగా వెలువడుతుంది. ఒక్కొసారి చిన్న చిన్న ఉండలుగా కూడా ఉండవచ్చు. ఉదయంపూట హెచ్చు మోతాదులో, పలుచగా మల విసర్జన జరగడం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. రాత్రిపూట విరేచనమవడం చాలా అరుదు. అలాగే ఆహారం తీసుకున్న వెంటనే మల విసర్జన చేయాలనిపించడం కూడా ఈ వ్యాధి లక్షణాలలో ప్రధానమైనది.

Related posts