telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

తుది దశలో జగన్ పాదయాత్ర… వెంటనే మిగిలిన నియోజకవర్గాలలో…

YS Jagan Files Nomination Pulivendul

వైసీపీ అధినేత ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పాదయాత్ర ముగింపు దశకు వచ్చేసింది. ఈ యాత్ర ద్వారా ఆయన ప్రజా సమస్యలు తెలుసుకునే దిశగా, పాదయాత్రను చేపట్టి దాదాపు ఏడాదికిపైగా ప్రజల్లో ఉంటూ 335 రోజుల పాటు నడిచిన వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర తుది దశకు చేరుకుంది. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన పాదయాత్ర, నేడు శ్రీకాకుళం జిల్లాలో చివరి నియోజకవర్గమైన ఇచ్చాపురం చేరుకోనుంది. ఇచ్చాపురంలో దాదాపు 60 కిలోమీటర్లకు పైగా జగన్ పాదయాత్ర సాగనుండగా, జనవరి 9 నాటికి ఇది ముగియవచ్చని తెలుస్తుంది.

యాత్ర ముగిసే ఆఖరి రోజు జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొనే జగన్, ఆ వెంటనే తిరుమలకు వెళ్లి, శ్రీవారి మెట్టు మార్గంలో కొండపైకి చేరుకుని స్వామిని దర్శించుకోనున్నారు. ఆపై సాధ్యమైనంత త్వరగా, పాదయాత్ర మార్గంలో తాను వెళ్లని నియోజకవర్గాల్లో పర్యటించి, అక్కడి ప్రజలను కలవాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఇక పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని వైకాపా వర్గాలు తీవ్రంగా ఇప్పటి నుండే ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల వరకు జగన్ ప్రజలతోనే ఉండేట్టుగా తన తదుపరి కార్యాచరణ కూడా ప్రణాళిక వేసుకున్నట్టు తెలుస్తుంది. పాదయాత్ర అనంతరం కూడా పార్టీ బలహీనంగా ఉన్న నియోజక వర్గాలలో తిరిగి ప్రజలలోకి వెళ్లాలని జగన్ నిర్ణయించినట్టు పార్టీవర్గాల సమాచారం.

Related posts