telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నా జీవితంలో అది ఎప్పటికీ మరచిపోలేను : తా​ప్సీ

taapsi

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన సినీ నటులు సరదాగా గడుపుతున్నారు. ఈ సమయంలో తా​ప్సీ పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకొంటున్నారు. తాజాగా 2018లో తాప్సీ నటించిన హిందీ చిత్రం ‘మన్‌మారిజియన్‌’ షూటింగ్‌ లోకేషన్‌లో తీసిన ఒక ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకుంది. ఆ ఫోటోలో తాప్సీ ఒక వైట్‌ స్కూటీపై కూర్చుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంటే ఆమె వెనకాల కెమెరామెన్‌ షూటింగ్‌కు సంబందించి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. ఈ ఫోటో నాకు ఎప్పటికి గుర్తుండిపోతుంది.. ఎందుకంటే ఆరోజు షూటింగ్‌ లొకేషన్‌లో ఇంకా షూటింగ్‌ స్టార్ట్‌ కాలేదు. బైక్‌పై ఉన్న నేను నా వెనకాల అసలు ఏం జరుగుతుందో పట్టించుకోలేదు. నేను ఆలోచిస్తూ కూర్చుంటే.. కెమెరామెన్లు మాత్రం నా బైక్‌పై కెమెరాలు పెట్టి వారి పనిలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో నేను నా భావోద్వేగంతో పాటు బండి బరువును కూడా బ్యాలెన్స్‌ చేసుకున్నానా అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. నాకు ఆ గందరగోళం మళ్లీ తిరిగి వస్తే బాగుంటుందనిపించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఉన్నంతవరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను షేర్‌ చేస్తూ జ్ఞాపకాలను నెమరువేసుకుంటా అని తప్సీ తెలిపింది.

Related posts