telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఆరేళ్ళ పాపను లిఫ్ట్ లోకి తీసుకెళ్ళి…?

minor girl abused by tech students

విమానంలో అటెండెంట్‌గా ఉద్యోగం చేస్తున్న ఓ భారతీయుడు దుబాయిలో నివాసం ఉంటున్నాడు. అతనికి ఆరేళ్ల కూతురు ఉంది. ఒకరోజు ఆ చిన్నారి తండ్రి దగ్గరకు వచ్చి ఇల్లు శుభ్రం చేయడానికి వచ్చే వ్యక్తిని ఇంటికి రానివ్వద్దని కోరింది. కూతురు అలా అడగడంతో షాకైన తండ్రి.. అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యాడు. ఏం జరిగిందంటే… బంగ్లాదేశ్‌కు చెందిన ఆ పనివాడు తన కూతుర్ని లిఫ్టులోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడని, కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టడం చేస్తున్నాడని తెలిసి కోపంతో ఊగిపోయాడు. ఇంటి దగ్గర ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించిన ఆయన.. చుట్టుపక్కల పిల్లలతో ఆడుకుంటున్న తన కూతుర్ని ఆ పనివాడు పిలుచుకెళ్లడం చూశాడు. ఆ తర్వాత తన కంటపడిన పనివాడిని నిజం చెప్పాలని బెదిరించాడు. తన తప్పు ఒప్పుకొన్న నిందితుడు క్షమాపణలు కోరాడు. ఆ తండ్రి ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతన్ని కోర్టులో హాజరుపరిచారు. అతనికి 6 నెలల జైలు శిక్ష విధించిన కోర్టు.. శిక్ష పూర్తికాగానే అతన్ని దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది.

Related posts