సీఎం యడియూరప్ప కు బళ్ళారి జిల్లాను రెండుగా విభజించాలనే నిర్ణయం చిక్కుల్లో పడేస్తుంది. విజయనగర్ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా చేస్తామని ఇటీవల ఆ ప్రాంతానికి చెందిన ప్రతినిధులకు యడియూరప్ప హామీ ఇచ్చారు. అనర్హత ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్ ఒత్తిడితో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారని అదే జరిగితే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని బళ్ళారి జిల్లా కీలక ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి హెచ్చరించారు.
యడ్యూరప్ప ప్రకటనతో బీజేపీలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం కొనసాగి పదవులు అనుభవించి ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన ఆనంద్‌సింగ్ కోసమే జిల్లాను విడగొడతానంటే ఎలా సాధ్యమని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కొన్నేళ్ళకాలంగా కొప్పళ్, బెళగావి జిల్లాలను విభజించాలనే డిమాండ్‌లపై సీఎం ఎందుకు స్పందించడం లేదనేది ప్రస్తుతం కీలకం అవుతోంది. జిల్లా విభజన తేనెతుట్టె లాంటిదని కదిపితే కష్టమేనని పార్టీలోనే భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాజకీయాల సుడిగుండంలో పాలన సాగిస్తున్న యడియూరప్ప అనవసరంగా జిల్లా విభజన ప్రస్తావన తీసుకొచ్చారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే జిల్లా విభజన అంత సులువేమీ కాదనిపిస్తోంది.
వైసీపీ సర్కారు వైఖరితో రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదు: సోమిరెడ్డి