ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపిలో రెండు వర్గాలున్నాయని.. అందులో కేసీఆర్ కు అనుకూలమైన వర్గం వుందని..అందుకే ప్రగతి భవన్ గేట్లు తెరుచుకున్నాయని తెలిపారు. కానీ.. ప్రగతి భవన్ గేట్లు.. ప్రజాప్రతి నిధులకు, పబ్లిక్ కు తెరుచుకోవని.. కిషన్ రెడ్డి, బండి సంజయ్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని పేర్కొన్నారు. రామచందర్ రావు ను బలిపశువును చేసే కుట్ర జరుగుతుందని.. బిజెపి , టీఆరెస్ కుమ్మకై.. లింగోజి గూడలో.. టీఆరెస్ బరిలో అభ్యర్థిని పెట్టలేదని ఆరోపణలు చేశారు. అదే విధంగా.. జల్ పల్లి లో ఏకగ్రీవం ఎలా అయిందని..జల్ పల్లి లో.. Mimకు ఏకగ్రీవం చేస్తారని మండిపడ్డారు. టీఆరెస్, బిజెపి రెండు పార్టీలు mimకు సపోర్ట్ చేస్తున్నాయని.. వార్డు నెంబర్ 26 నల్గొండ కార్పొరేషన్ లో దుబ్బాక కాంతమ్మ చనిపోతే.. బిజెపి, టీఆరెస్ బరిలో దిగాయని ఫైర్ అయ్యారు. చివరికి mim కూడా పోటీలో పెట్టిందన్నారు. తెలంగాణలో ఓ మంచి సంప్రదాయం తేవాలని టీఆరెస్ అనుకోవడం మంచిదేనని… కానీ నల్గొండలో.. మా కాంగ్రెస్ అభ్యర్థి చనిపోతే.. ఎట్లా పోటీ లో పెడతారని నిప్పులు చెరిగారు. అమ్మానాన్న మధ్యలో తమిళ అమ్మాయిలా..టీఆరెస్ , బిజెపి మధ్య mim వుందని సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. విచారణ కమిటీ వేసి.. బిజెపి రామచందర్ రావును ఆగం చేసే కుట్ర జరుగుతుందని… కిషన్ రెడ్డి పొమ్మంటేనే రామచందర్ రావు ప్రగతి భవన్ కు వెళ్ళాడని ఆరోపణలు చేశారు. బీజేపీలో అంతర్గత పోరు తీవ్రంగా వుందని… బండి సంజయ్ ప్రెసిడెంట్ పదవి నుండి తొలగించాలని కిషన్ రెడ్డి.. కేంద్ర మంత్రి పదవి నుండి కిషన్ రెడ్డిని తొలగించాలని బండి సంజయ్ ట్రై చేస్తున్నారని ఆరోపించారు.
previous post
next post