telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

విద్యుత్‌ వాడకంలోనూ రికార్డు సృష్టించిన భారత్….

andhrapradesh 4th in solar power production

ప్రపంచం లో భారత దేశం చాలా విషయాలలో రికార్డు నెలకొలింది. అయితే తాజాగా మరో కొత్త విషయంలో కూడా రికార్డు సృష్టించింది. అయితే భారత్‌లో క్రమంగా విద్యుత్‌ వినియోగం పెరిగిపోతోంది… ఇవాళ కొత్త రికార్డును సృష్టించింది.. శుక్రవారం ఉద‌యం ఇది ఏకంగా 187.3 గిగావాట్లకు చేరింది విద్యుత్‌ డిమాండ్‌.. ఇప్పటి వరకు ఇదే అత్యధికం.. కాగా, గ‌తంలో విద్యుత్‌ డిమాండ్‌ (జనవరి 21 బుధవారం) 185.82 గిగావాట్లుగా రికార్డు ఉండగా… శుక్రవారం ఆ రికార్డు బ్రేక్ అయ్యింది. అయితే, భార‌త ఆర్థిక వ్యవ‌స్థ వేగంగా పుంజుకుంటోంది అన‌డానికి ఇది సంకేతంగా చెబుతున్నారు విశ్లేషకులు.. కరోనా సమయంలో చాలా పరిశ్రమలు మూతపడంగా.. ఆ తర్వాత క్రమంగా అన్ని రీ ఓపెన్ అవుతూ ఉన్నాయి.. విద్యుత్‌ డిమాండ్‌కు ఇది కూడా కారణంగానే చెప్పవచ్చు.. రెండేళ్ల క్రితం విద్యుత్ డిమాండ్ భారత్‌లో గ‌రిష్ఠంగా 168.74 గిగావాట్లుగా ఉండగా.. శుక్రవారం ఉద‌యం 10.28 గంట‌ల స‌మ‌యంలో అది 1,87,300 మెగావాట్లకు చేరిపోయిందని.. ఇది భార‌త ఆర్థిక వ్యవ‌స్థ బ‌లంగా పుంజుకుంటోంద‌న‌డానికి నిద‌ర్శనమంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు కేంద్ర మంత్రి రాజ్‌కుమార్ సింగ్. భారత్‌లో మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామ‌ర్థ్యం 373.43 గిగావాట్లుగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. చూడాలి మరి ఈ వినియోగం ఇంకా ఎంత వరకు పెరుగుతుంది అనేది.

Related posts