తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంగ్లంలో ఉన్న చట్టాలు, పాలనా నిబంధనలను, ఇతరత్రా వాటిని తెలుగులోకి తేవాలని నిర్ణయించారు. రాష్ట్రంలో అమలులో ఉన్న చట్టాలు, మాన్యువల్స్, నిబంధనావళి వంటివి ప్రజలకు అర్థమయ్యే భాషలో..తెలుగులో అందుబాటులోకి తీసుకురావాలని సిఎం ఆదేశించారు. దీంతో కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అయాచితం శ్రీధర్ ఆధ్వర్యంలోని బృందం కార్యాచరణకు పూనుకుంది. ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువదించిన మొదటి నిబంధనావళిని సిద్దం చేసింది.
ఈ ఆలోచన..గతేడాది జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలల్లోనే వచ్చింది. సిఎం కెసిఆర్ ఈ బాధ్యతలను దేశపతి శ్రీనివాస్, ఆయాచితం శ్రీధర్‌కు అప్పగించారు. దీనితో వారి నేతృత్వంలోనే బృందం మొదటగా ప్రభుత్వ పరిపాలనా నిబంధనావళి, సచివాలయ నిబంధనలను తెలుగులోకి అనువదించింది. ప్రతిని సిద్ధం చేసి సిఎం కెసిఆర్ పరిశీలనకోసం సమర్పించారు. వీటికి సిఎం కెసిఆర్ ఆమోదం తెలపగానే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, ఆయా శాఖల వెబ్‌సైట్‌లోనూ పొందుపరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
ప్రథమ తెనుగీకరణ ప్రతిని సిద్ధం చేసిన బృంధం ఆతర్వాత తర్జుమా చేయాల్సిన చట్టంపై కసరత్తు ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా అమల్లోకి తీసుకొచ్చిన నూతన పంచాయితీరాజ్ చట్టాన్ని తెనుగీకరించే ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఇలా ఒక్కొక్కటిగా చట్టాలన్నింటీని తెలుగీకరించే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది.
సుదర్శన యాగంతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి: హరీష్ రావు