telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

హైకోర్టు తీర్పు జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టు: బుచ్చయ్య చౌదరి

gorantla buchayya on resignation

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌ తొలగింపు వ్యవహారంపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌‌ను ఎస్‌ఈసీగా కొనసాగించాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. నిమ్మగడ్డ రమేశ్ అంశానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టని అన్నారు.

వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటి వరకు 58 కోర్టు తీర్పులు వచ్చాయని చెప్పారు. ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగే అర్హత జగన్ కు లేదని, ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జగన్ నియంతృత్వ పోకడల వల్ల అధికారులు కోర్టు బోనుల్లో నిలబడాల్సి వస్తోందని చెప్పారు. జగన్ అక్రమాస్తుల కేసు ఎనిమిదేళ్లుగా వాయిదా పడుతూ వస్తోందన్నారు. కేసు విచారణను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

Related posts