స్టార్ హీరోయిన్ పూజా హిగ్దే వరుస సినిమాలతో బిజీ అయింది. ఈ అమ్మడి గ్రామర్‌కు కుర్రకారు గుడి కడుతున్నారు. దాంతో నిర్మాతలు కూడా ఈ ముద్దుగుమ్మను ప్రిఫర్ చేస్తున్నారు. ప్రస్తుతం పూజా చేతిలో మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటుగా అఖిల్ అక్కినేని హీరోగా చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలోనూ నటిస్తోంది. వీటితో పాటుగా మధ్యలో బాలీవుడ్‌లోను మెరవనుంది. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చేస్తున్న ‘కబీ ఈద్ కబీ దివాళి’ సినిమాలో కనిపించనుంది. అంతేకాకుండా రన్‌వీర్ సింగ్, రోహిత్‌తో కలిసి క్రికస్ అనే సినిమాలో చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ భామ మరో బంపర్ ఆఫర్ కొట్టేసిందట.
అదేంటంటే… మహేష్‌బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి ఓ సినిమా చేయనున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో పాటు ప్రేమకథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీలో హీరోయిన్‌గా పూజాహెగ్డేను తీసుకోనున్నారని సమాచారం. ఇప్పటికే పూజాతో చిత్రబృందం చర్చలు కూడా జరిపేసిందట. స్క్రిప్టు విన్న పూజా.. సానుకూలంగా స్పందించిందట. త్వరలోనే మహేష్‌తో కలిసి పనిచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. “ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28” వర్కింగ్ టైటిల్‌గా రూపొందనున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని సంస్థలు, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్ సహకారంతో నిర్మించనున్నారు. కాగా.. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.