telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రవితేజ “క్రాక్”… ఫస్ట్ లుక్ విడుదల

Krack

మాస్ మ‌హారాజా ర‌వితేజ త్వరలో “డిస్కో రాజా” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రం త‌ర్వాత త‌న 66వ చిత్రాన్ని గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నాడు. ఈ మూవీ వాస్త‌వ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్క‌నుంది. కొన్నేళ్ళ క్రితం తెలుగు రాష్ట్రాల‌లో జ‌రిగిన రియ‌ల్ ఇన్సిడెంట్స్‌తో మూవీని తెర‌కెక్కించ‌నున్నాం అని గోపిచంద్ ఇటీవ‌ల స్ప‌ష్టం చేశారు. తాజాగా రవితేజ 66వ చిత్రానికి `క్రాక్‌` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. `డాన్‌శీను`, `బ‌లుపు` చిత్రాల త‌ర్వాత ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్ర‌మిది. స‌ర‌స్వ‌తి ఫిలిమ్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ర‌వితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. గురువారం ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు. గ‌డ్డంతో కోర మీసాలున్న ర‌వితేజ డిఫ‌రెంట్ లుక్ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంది. ఈ లుక్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

Related posts