telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

షాహిద్ కపూర్ హీరోగా “జెర్సీ” హిందీ రీమేక్

Shahid-Kapoor

గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో నాని న‌టించిన తాజా చిత్రం “జెర్సీ”. ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుద‌ల అయింది. ఈ చిత్రానికి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ల‌భించింది. నాని క్రికెట‌ర్‌గా అద‌రగొట్టాడ‌ని సెలెబ్రిటీలు సైతం ప్రశంసల జల్లు కురిపించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో శ్ర‌ద్ధా శ్రీనాథ్ కథానాయికగా న‌టించింది. జెర్సీ సినిమాలో నాని అర్జున్ అనే క్రికెటర్ పాత్రను పోషించాడు. 1996-97 రంజీట్రోఫీ క్రికెట్ నేపథ్యంలో ఈ చిత్ర కథ నడిచింది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. అల్లు అర‌వింద్‌, దిల్‌రాజు, అమ‌న్ గిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ఆగ‌స్ట్ 28న సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేశారు. షాహిద్ కపూర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ ఏడాది విడుద‌లైన తెలుగు చిత్రం “అర్జున్ రెడ్డి” బాలీవుడ్ రీమేక్ `క‌బీర్ సింగ్‌` సెన్సేష‌న‌ల్ హిట్‌ను సాధించింది. రూ.300 కోట్ల‌ను సాధించి ఈ ఏడాది భారీ హిట్ సాధించిన బాలీవుడ్ చిత్రంగా రికార్డ్‌ను సొంతం చేసుకుంది. తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ పాత్ర‌ను హిందీలో షాహిద్ క‌పూర్ సాధించారు. మరి ఈ చిత్రం షాహిద్ కే మరింత క్రేజ్ ను తీసుకొస్తుందేమో చూడాలి.

Related posts