telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

నగరంలో రవాణా వ్యవస్థను మెరుగు పరచడానికి చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను వెంటనే చేపట్టాలి – కమిషనర్ రోనాల్డ్ రోస్

నగరంలో రవాణా వ్యవస్థను మెరుగు పరచడానికి చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను వెంటనే చేపట్టాలని కమిషనర్ రోనాల్డ్ రోస్ రైల్వే అధికారులను కోరారు. ఫలక్‌నుమా, శాస్త్రి పురం ఆర్.ఓ.బి, యాకుత్ పుర లోని ఆర్.యు.బి రైల్వేకు సంభందించిన పనులు ఇంకా చేపట్టక పోవడం మూలంగా ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందనీ కమిషనర్ తెలిపారు. ఈ విషయంలో రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులు కోరారు. ఈ విషయం రైల్వే ఉన్నాధికారుల తో తాను కూడా మాట్లాడుతానని అన్నారు ఈ సందర్భంగా కమిషనర్ ఫలక్‌నుమా, శాస్త్రి పురం ఆర్.ఓ.బి లను, మస్జీద్ కిరణం నుండి మూసీ రివర్ వరకు, మజీద్ అలి మజీద్ నుండి వయా దూద్ బౌలి మీదుగా హుస్సేన్ అలాం వరకు టిప్పు సుల్తాన్ వజీర్ అలి మజీద్ నుండి పురాణ హవేలీ గేట్ వరకు శాస్త్రి పురం నుండి వయా వట్టేపల్లి మీదుగా ఫలక్‌నుమా బస్ డిపో వరకు చేపట్టనున్న రోడ్డు వెడల్పు పనులను ఎమ్మెల్సీ మహమ్మద్ అహ్మద్ తో కలిసి మంగళవారం కమిషనర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ప్రాసెస్ లో ఉన్నందున మిగిలిన భూసేకరణ వేగవంతంగా పూర్తి చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు.

కమీషనర్ వెంట ప్రాజెక్టు సి.ఇ దేవానంద్, ఎస్.సి రవీందర్ రాజు, సిసిపి రాజేంద్ర ప్రసాద్ నాయక్, కార్పొరేటర్లు సయ్యద్ సోహెల్ ఖాద్రీ, మహమ్మద్ వాసియోద్దిన్, ఎస్.ఆర్.డి.పి ప్రాజెక్ట్ ఇంజనీర్ లు తదితరులు పాల్గొన్నారు.

—————————————————-

– సిపిఆర్ఓ జిహెచ్ఎంసి ద్వారా జారీచేయడమైనది.

Related posts