telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

బ్లాక్ ఫంగస్… ఎవరికి సోకుంతుంది.. ఎలా గుర్తించాలో తెలుసా !

‘బ్లాక్ ఫంగస్’. ఇది ఎవరికి ఏర్పడుతుంది? ఎందుకు ఏర్పడుతుంది? ఎవరు జాగ్రత్తగా ఉండాలి? దీన్ని ఎలా గుర్తించాలి?

అసలే కరోనా వైరస్‌తో దేశం అల్లాడుతుంటే.. కొత్తగా బ్లాక్ ఫంగస్ (Black fungus) కలవరపెడుతోంది. ప్రపంచంలోనే ఎక్కడలేనన్ని కేసులు ఇండియాలో నమోదవుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మహమ్మారి ఏదో ఒక రూపంలో సోకుతోంది. మొదటి దశలో విరుచుకుపడిన కరోనాతో పోల్చితే.. రెండో దశ వైరస్ చాలా ప్రమాదకరంగా ఉంది. ఈ వ్యాధికి గురవుతున్న బాధితుల సంఖ్యే కాకుండా.. మరణాలు కూడా పెరగడం కలచివేస్తోంది. ముఖ్యంగా వైరస్ శరవేగంగా ఊపిరితీత్తుల్లోకి చేరుతోంది. దీంతో బాధితులు ఆక్సిజన్ తీసుకోడానికి ఇబ్బందిపడుతున్నారు. చివరికి ప్రాణాలు వీడుతున్నారు

 

కరోనాకు తోడు ‘బ్లాక్ ఫంగస్’ అనే వ్యాధి మరింత కలవరానికి గురిచేస్తోంది. దీన్ని మ్యుక‌ర్‌మైకోసిస్ (Mucormycosis) అని కూడా పిలుస్తున్నారు. మొన్నటి వరకు ఢిల్లీకే పరిమితమైన ఈ ఫంగస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా కనిపించడంతో ప్రజలు ఆందోళనకు గురవ్వుతున్నారు. బాధితుడికి కరోనా కంటే ముందుగానే ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే.. ‘బ్లక్ ఫంగస్’కు గురయ్యే అవకాశాలున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఇటీవల వెల్లడించారు. మొదట్లోనే దీన్ని గుర్తిస్తే వ్యాధిని అరికట్టవచ్చని తెలిపారు. మరి ‘బ్లాక్ ఫంగస్’ అంటే ఏమిటీ? అది ఎవరికి సోకుతుంది? లక్షణాలేమిటీ?

 

❂ డయాబెటీస్ నియంత్రణలో లేని కరోనా బాధితుల్లో ‘బ్లాక్ ఫంగస్’ ఏర్పడుతున్నట్లు గుర్తించారు.

 

❂ కిడ్నీ మార్పిడి తదితర సర్జరీలు, చికిత్సల కోసం ఇమ్యునిటీ కంట్రోల్ డ్రగ్స్ వాడిన రోగుల్లో కూడా ‘బ్లాక్ ఫంగస్’ ఏర్పడుతోంది.

❂ ఇదివరకే అనారోగ్య సమస్యలున్న కరోనా బాధితులకు స్టిరాయిడ్స్ అతిగా ఇవ్వడం వల్ల ఈ సమస్య ఏర్పడుతున్నట్లు కనుగొన్నారు.

❂ సైనసైటిస్‌ సమస్య ఉన్నవారికి కూడా బ్లాక్‌ ఫంగస్‌ ఏర్పడవచ్చు.

❂ ‘బ్లాక్ ఫంగస్’ ఏర్పడితే ముక్కు చుట్టూ నొప్పి ఏర్పడుతుంది.

 

❂ బ్లాక్ ఫంగస్ వల్ల కళ్లు ఎర్రబడతాయి. ముఖం వాపు, తిమ్మిరులు ఏర్పడతాయి.

❂ తలనొప్పి, జ్వరం, దగ్గు, రక్తపు వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు.

❂ మానసిక స్థితి అదుపుతప్పడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

❂ ముక్కులో దురద, కళ్లపైన లేదా కళ్ల కింద ఉబ్బినట్లు కనిపించినా, కంటిచూపు మందగించినా వైద్యులను సంప్రదించాలి.

 

❂ దంతాల్లో నొప్పిగా ఉన్నా అప్రమత్తం కావాలి.

❂ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారికి ఈ ఫంగస్ ఏర్పడవచ్చు.

❂ కోవిడ్ బాధితులందరికీ ఈ ఫంగస్ ఏర్పడదు. కాబట్టి.. అందోళన వద్దు.

ఈ_జాగ్రత్తలతో_బయటపడొచ్చు:

❂ కోవిడ్ చికిత్స పొందేవారు ఇదివరకు ఏమైనా వ్యాధులలతో బాధపడినా, శస్త్ర చికిత్సలు చేయించుకున్నా వైద్యులకు ముందుగా తెలియజేయాలి.

❂ కోవిడ్ చికిత్స అందించే వైద్యులకు ముందుగా మీ అనారోగ్య సమస్యలను తెలియజేస్తే.. ఫంగస్ ఏర్పడకుండా జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది.

❂ డయాబెటీస్‌ను అదుపులో ఉంచుకోవడం. మోతాదుకు మించి స్టెరాయిడ్స్‌ వాడకుండా జాగ్రత్త పడటం ద్వారా ‘బ్లాక్ ఫంగస్’ ఏర్పడకుండా జాగ్రత్తపడవచ్చు.

             ఆక్సిజన్‌కు తయారీకి వాడే నీరు కూడా కారణమా?: కోవిడ్ బాధితులకు ‘హ్యూమిడిఫయర్లు’ ద్వారా ఆక్సిజన్ అందిస్తారు. వీటిలో స్టెరైల్ వాటర్‌ను ఉపయోగించాలి. వాటికి బదులు సాధారణ నీటిని వాడితే ‘బ్లాక్ ఫంగస్’ ఏర్పడే ప్రమాదం ఉందని అహ్మదాబాద్‌కు చెందిన సీనియర్ కార్డియలజిస్ట్ ఓ వార్త సంస్థతో మాట్లాడుతూ.. ఆక్సిజన్‌కు ఉపయోగించే హ్యూమిడిఫయర్లలో కేవలం స్టెరైల్ నీటిని మాత్రమే వాడాలని తెలిపారు. కానీ, కొన్ని హాస్పిటళ్లు, ఐసోలేషన్ కేంద్రాలు, హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు సాధారణ నీటిని ఉపయోగిస్తు్న్నారని, వాటిలో ఉండే సూక్ష్మ జీవులు శరీరంలోకి చేరడం వల్ల ఫంగస్ ఏర్పడుతుందన్నారు. హ్యూమిడిఫయర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ.. నీటిని మార్చడం ద్వారా ఈ సమస్య నుంచి కాపాడవచ్చని తెలిపారు.

బ్లాక్_ఫంగస్_లక్షణాలేంటంటే..

కళ్లు, ముక్కు చుట్టూ ఎర్రగా అవ్వడం లేదా నొప్పి రావడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, ఊపిరి సరిగా ఆడకపోవడం, రక్తపు వాంతులు, మానసిక సమస్యలు వంటి లక్షణాలు ఉంటాయి.

నాలికపై నల్లటి మచ్చలు ఏర్పడినా కూడా దానిని బ్లాక్ ఫంగస్‌గానే భావించి పరీక్షలు చేయించుకోవాలి. ముక్కు చుట్టూ చర్మంపై నల్ల మచ్చలు కూడా కనిపిస్తాయి.అయితే సంతోషించదగిన విషయం ఏంటంటే.. ఇది అంటు వ్యాధి కాదు. ఒకరి నుంచి ఇతరులకు సోకదు. వ్యాధి నిరోధక శక్తి బాగా ఉంటే… ఇది మనల్ని ఏమీ చెయ్యలేదు.

బ్లాక్ ఫంగస్ సోకితే… 24 గంటల్లోనే చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ బ్లాక్ ఫంగస్… ఎముకలను కూడా తినేస్తుంది. సోకిన కొన్ని గంటల్లో బ్రెయిన్‌కు ఎఫెక్ట్ అవుతుంది. తద్వారా రోగి చనిపోతాడు. అయితే దీనిని గుర్తించి వెంటనే ట్రీట్‌మెంట్ అందిస్తే… రోగిని బతికించే అవకాశం ఉంటుంది. దీనికోసం కేంద్రం ‘యాంఫోటెరిసిన్ బి’ అనే మందును ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచింది. ఈ మందు వాడితే బ్లాక్ ఫంగస్ నుంచి విముక్తి లభిస్తుంది.

బ్లాక్_ఫంగస్_రాకుండా_చూడాలంటే..

డయాబెటిస్ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కరోనా నుంచి రికవరీ అయిన డయాబెటిస్ ఉన్నవారు… డిశ్చార్జి అయ్యాక షుగర్ లెవెల్స్‌ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.

స్టెరాయిడ్ల_విషయంలో_చాలా_జాగ్రత్తగా_వాడాలి.

కరోనా సోకి ట్రీట్‌మెంట్ తీసుకునేటప్పుడు ముక్కు రంధ్రాలు మూసుకుపోతే… అది బ్లాక్ ఫంగస్ వల్ల కూడా కావచ్చని అనుకోవాలి.పైన తెలిపిన బ్లాక్ ఫంగస్ లక్షణాల్లో ఏది ఉన్నా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.వెంటనే ట్రీట్‌మెంట్ అందించడం ద్వారా రోగిని బతికించవచ్చు.

నరానికి వేసే యాంటీ ఫంగల్ ఇంజెక్షన్ తీసుకోవాలి. దానికి ఒక డోసుకు రూ.3500 అవుతుంది. ఈ ఇంజెక్షన్‌ను ఎనిమిది వారాలపాటు రోజూ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇన్‌ఫెక్షన్ నుంచి ఈ ఇంజక్షన్ మాత్రమే సమర్థంగా కాపాడగలదని వైద్యులు చెబుతున్నారు.

 

కొవిడ్ సోకిన రోగులు ఈ ఇన్ఫెక్షన్ రాకుండా, తమను తాము కాపాడుకోవాలంటే ఒకే ఒక అవకాశం ఉందని… చికిత్స సమయంలో, కోలుకున్న తర్వాత స్టెరాయిడ్స్ సరైన డోసులో, తగిన వ్యవధిలో వేసుకునేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

 

Related posts