telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

రీ సస్టైనబిలిటీ యొక్క గ్రీన్ గణేశ: విప్లవాత్మక పర్యావరణ అనుకూల వేడుకలు

విత్తన విగ్రహాలు, క్రియేటివ్ పేపర్&ప్లాస్టిక్ రీసైక్లింగ్&మరిన్నింటితో గణేష్ చతుర్థి వేడుకలు

రీ సస్టైనబిలిటీ లిమిటెడ్ (RESL) మరోసారి, #ReBIGGreenGanesha అవార్డు గెలుచుకున్న గ్రీన్ గణేశ కార్యక్రమం యొక్క 16వ ఎడిషన్ కోసం 92.7 BIG FMతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఈ కార్యక్రమం ద్వారా హైదరాబాద్, ముంబై మరియు ఢిల్లీలోని కమ్యూనిటీలను చేరుకోనుంది. ఈ మట్టి గణేశుడి విగ్రహాలలో విత్తనాలు, ఎరువులు పొందుపరిచారు. ఈ విగ్రహాలను అందుకున్న వ్యక్తులు #నిమర్జన్ కర్మను ఇంట్లో, పూల కుండలో నిర్వహించవచ్చు, ఈ విగ్రహాల ద్వారా కొత్త మొక్క రూపంలో కొత్త జీవితాన్ని సైతం పొందవచ్చు.

హైదరాబాద్ మరియు ఢిల్లీలలో, ఇది పర్యావరణ అనుకూలమైన విత్తన గణేశ విగ్రహాల పంపిణీని చేయనుంది. ఈ సంవత్సరం, రీ సస్టైనబిలిటీ మరియు 92.7 BIG FM మధ్య ఈ భాగస్వామ్యఆలోచనను మరింత ముందుకు తీసుకువెళ్లింది. హైదరాబాద్ మరియు ఢిల్లీ అంతటా ఉన్న కమ్యూనిటీల నుండి ఉపయోగించిన పేపర్ సేకరణ డ్రైవ్ ప్రారంభించబడింది, ఇది పెద్ద పర్యావరణ అనుకూల గణేశ శిల్పాలుగా రీసైకిల్ చేయబడుతుంది. ఈ డ్రైవ్ తర్వాత గణేష్ విగ్రహ స్థాపన&ఆర్తితో పాటు స్వీట్లు పంపిణీ ,7-రోజుల మాల్ యాక్టివిటీ ఉంటుంది.

శ్రీ గౌతం రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్. రీ సస్టైనబిలిటీ మాట్లాడుతూ , “ రాబోయే తరాలకు స్థిరమైన భవిష్యత్తును అందించాలంటే, సస్టైనబిలిటీ స్వీకరించడం ఒక ఎంపిక కాదు కానీ అవసరం. రీ బిగ్ గ్రీన్ గణేశ వంటి సంచలనాత్మక కార్యక్రమాల ద్వారా నీటి కాలుష్యాన్ని నిర్మూలించడంలో రీ సస్టైనబిలిటీ గణనీయమైన పురోగతి సాధించింది…” అని అన్నారు.

రీ సస్టైనబిలిటీ సీఈఓ మసూద్ మల్లిక్ మాట్లాడుతూ, “ ఈ సంవత్సరం, మా ప్రతిష్టాత్మక ప్రచారం భారతదేశంలోని ప్రతి ఇంటికి బాధ్యత&స్థిరమైన వేడుకల సందేశాన్ని తీసుకువెళుతుంది, అదే సమయంలో మిషన్ లైఫ్ యొక్క ముఖ్య సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటుంది…” అని అన్నారు

Related posts