కరోనా వైరస్ ప్రభావంతో వివిధ రంగాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండగా ఇన్ఫోసిస్ మాత్రం లాభాల బాటలో నడుస్తోంది. ఏప్రిల్ – జూన్ త్రైమాసికంలో ఇన్ఫోసిస్, ఊహించిన దానికన్నా మెరుగైన గణాంకాలను నమోదు చేయడంలో విజయం సాధించింది. ఈ ఉదయం స్టాక్ మార్కెట్లో ఇన్ఫీ ఈక్విటీ వాటా ఆకాశానికి ఎగసింది.
2019 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలను సంస్థ ప్రకటించింది. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పెరిగింది. సెషన్ ఆరంభంలోనే ఇన్ఫోసిస్ రికార్డు స్థాయి లాభాలను నమోదు చేసింది. గంట వ్యవధిలోనే ఇన్వెస్టర్లురూ. 50 వేల కోట్లకు పైగా లాభపడ్డారు. ఇన్ఫీ ఈక్విటీ విలువ ఏకంగా 15 శాతం పెరగడం గమనార్హం.
జూన్ 30తో ముగిసిన మూడు నెలల కాలంలో ఇన్ఫోసిస్ 11.5 శాతం నెట్ ప్రాఫిట్ వృద్ధిని నమోదు చేసి రూ. 4,233 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గత సంవత్సరం సంస్థ నికరలాభం రూ. 3,798 కోట్లు మాత్రమే. ఇక, కొత్తగా 1.74 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ ను సంస్థ కుదుర్చుకుంది. కన్సాలిడేటెడ్ విధానంలో ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే 8.5 శాతం పెరిగి రూ. 21,803 కోట్ల నుంచి రూ. 23,665 కోట్లకు పెరిగిందని సంస్థ పేర్కొంది.
ఈవోని మంత్రి వెనకేసుకొస్తున్నారు: దేవినేని ఉమ