telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

భారత్ లో వ్యాక్సిన్ అప్పటినుండి అందుబాటులోకి… 

corona vaccine

భారత్ లో కరోనా ఉధృతి తగ్గడం లేదు.  కరోనా కరోనా పాజిటివ్ కేసులు రోజుకు 40వేలకు పైగా నమోదవుతున్నాయి.  కేసుల సంఖ్యతో పాటుగా రికవరీ రేటు కూడా పెరుగుతున్నది.  అయితే, ఇండియాలో మూడురకాల కరోనా వ్యాక్సిన్లు తయారవుతున్నాయి.  ఇందులో భారత్ బయోటెక్ ఫార్మా నుంచి రాబోతున్న కొవాగ్జిన్ మార్చి తరువాత అందుబాటులోకి వస్తుంది.  జైడస్ క్యాడిలా   వ్యాక్సిన్   రెండోదశ   ట్రయల్స్ ను నిర్వహిస్తున్నారు.  ఇకపోతే ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి సీరం ఇన్సిటిట్యూట్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను డెవలప్ చేస్తున్నాయి.  ఈ వ్యాక్సిన్ ప్రసుత్తం మూడోదశ ట్రయల్స్ ను జరుపుకుంటోంది.  కోవిషీల్డ్ వ్యాక్సిన్ జనవరి నుంచి అందుబాటులోకి రాబోతున్నట్టు సీరం ఇన్సిట్యూట్ అఫ్ ఇండియా సీఈవో పూనావాలా తెలిపారు. నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు రావాల్సి ఉందని, అనుమతులు వస్తే జనవరి నుంచి ఉత్పత్తి మొదలుపెడతామని అంటున్నారు.  ఉత్పత్తులు ప్రారంభించాక నెలకు 60నుంచి 70 మిలియన్ డోసులు ఉత్పత్తి చేయాలని, క్రమంగా ఆ సంఖ్యను 100 మిలియన్ కు పెంచాల్సి ఉంటుందని తెలిపారు.

Related posts