telugu navyamedia
క్రీడలు వార్తలు

మరోసారి అభిమానుల మనస్సు గెలుచుకున్న రోహిత్…

నిన్న ముంబై ఇండియన్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 2 వికెట్ల తేడాతో విజయం సాధించి బోణి చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరో ఓపెనర్‌ క్రిస్‌ లిన్‌తో జరిగిన మిస్‌ కమ్యునికేషన్‌ వల్ల రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. అయితే ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌ ఆడేందుకు మైదానంలోకి వస్తున్న సమయంలో మైదానంలోని కెమెరాలు‌ రోహిత్‌ శర్మ షూను పదేపదే చూపించాయి. రోహిత్‌ వేసుకున్న షూపై ‘సేవ్‌ ది రైనోస్‌’ అని రాసి ఉంది. ‘సీఇంగ్ పాసిబులిటీస్’ అని మరో షూపై రాసుంది. రెండు షూలపై రైనోస్‌ బొమ్మలు ప్రింట్ చేసి ఉన్నాయి. మొదటగా సేవ్‌ ది రైనోస్‌ అని సరిగా కనిపించకపోవడంతో అభిమానులు కాస్త తికమక పడ్డారు. అసలు విషయం తెలుసుకున్నాక అందరూ రోహిత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత రోహిత్‌ తన ట్విటర్‌లో ఈ విషయంపై స్పందించాడు. ‘నేను నిన్న మ్యాచ్‌లో బరిలోకి దిగడానికి నడుచుకుంటూ వస్తున్నప్పుడు.. ఆట కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను. క్రికెట్‌ ఆడడం అనేది నాకు డ్రీమ్‌. దానిని నెరవేర్చుకున్నా. కానీ ప్రకృతిని కాపాడలనేది మన బాధ్యత. అందరం కలిసికట్టుగా పోరాడితే.. కచ్చితంగా అనుకున్నది సాధిస్తాం. మన దేశంలో ఇండియన్‌ రైనోలు అంతరించే స్థితికి చేరుకున్నాయి. వాటిని కాపాడాల్సిన బాధ్యత మనది. మనమందరం కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకే నా షూపై అలా రాసుకున్నా’ అని రోహిత్ శర్మ రెండు ట్వీట్లు చేశాడు.

Related posts