telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు : ఓటు హక్కు వినియోగించుకున్న కేటీఆర్‌, కిషన్‌రెడ్డి

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌.. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఓటర్లు మాస్కులు ధరించి.. కరోనా రూల్స్‌ పాటిస్తూ ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు. అయితే.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్‌ దంపతులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. బంజారాహిల్స్‌లోని నందినగర్‌ జీహెచ్‌ఎంసీ కమిటీ హాల్‌లో ఓటు వేశారు. కుటుంబ సమేతంగా వచ్చిన కేటీఆర్‌ పోలింగ్‌ బూత్‌ 8 లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసే వారికి మాత్రమే ప్రశ్నించే హక్కు ఉంటుందని కేటీఆర్‌ అన్నారు. దయచేసి అందరూ ఓటేయాలని కోరారు. ఆలోచించి వేయాలని.. ఓటు వేసి హైదరాబాద్‌ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. అటు కాచిగూడలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరూ స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది సామాన్యుడి పాశుపతాస్త్రమని… సామాన్య పౌరుడు నుంచి రాష్ట్రపతి వరకూ ఓటే ఒక ఆయుధమన్నారు.

Related posts