telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఫీజులను కట్టడిచేసే దమ్ము కేసీఆర్‌కు లేదు: బండి సంజయ్

BJP Bandi sanjay

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఫీజులను కట్టడిచేసే దమ్ము కేసీఆర్‌కు లేదని అన్నారు. . మంచి జరిగితే కేసీఆర్ ఖాతాలో.. చెడు జరిగితే కేంద్రంపై నెపం వేస్తున్నాడని విమర్శించారు.

తెలంగాణలో రజాకార్ల పాలన సాగుతోందన్నారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చారన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కాకుండా జేబులు నింపుకోవడానికే కేసీఆర్ అప్పులు చేస్తున్నారన్నారు. ప్రగతి భవన్, ఫామ్ హౌస్ నుంచి పాలనను అంతమెందించాలన్నారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా జరపాలన్నారు. కేసీఆర్ కుటుంబ చరిత్ర కోసమే.. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడం లేదన్నారు.

Related posts