telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నోముల మృతికి సీఎం కేసీఆర్ సంతాపం

నాగార్జున సాగర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య(64) ఇవాళ ఉదయం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తెల్లవారు జామున నోముల తుదిశ్వాస విడిచారు. తెల్లవారు జామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండగా హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే… పరిస్థితి విషమించడంతో నోముల నర్సింహయ్య చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే.. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. జీవితాంతం ప్రజల కోసం పని చేసిన నాయకుడిగా నిలిచి పోతారని సీఎం అన్నారు. తెరాస పార్టీకి, నియోజకవర్గ ప్రజలకు తీరని లోటు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నోముల నర్సయ్య మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు సీపీఐ నారాయణ. నిరంతరం ప్రజలపట్ల అందుబాటులో వున్న నోముల మరణం తీరని లోటన్నారు. నోముల నరసింహామయ్య ఆకస్మిక మృతి పట్ల రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన మరణం ఉమ్మడి నల్లగొండ జిల్లా కు తీరని లోటు అని ఆయన పేర్కొన్నారు. నోముల న‌ర్సింహయ్య మృతి ప‌ట్ల‌ భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సంతాపం వ్య‌క్తంచేశారు. న‌ల్గొండ జిల్లా ఒక మంచి నిస్వార్థ రాజ‌కీయ నాయకుడిని కోల్పోయింద‌ని వివ‌రించారు. వారి కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతిని తెలిపారు. నోముల నర్సింహయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు ఎంపీ నామా నాగేశ్వరరావు.

Related posts