టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో దాని తీవ్రతను తెలిపేవిధంగా భలే వార్తలు సామజిక మాధ్యమాలలో హాల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక పెళ్ళిలో టమాటా ఆభరణాలు వాడటం విశేషం. పెళ్లి కూతుళ్లు కొత్త కొత్త డిజైన్లతో రూపొందించిన నెక్లెస్‌లు ధరించేందుకు ఉత్సాహం చూపుతారు. పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా ఉండేలా బంగారు ఆభరణాలు వేసుకోవాలని ప్లాన్ చేసుకుంటారు.
పాకిస్తాన్‌లో వీటన్నింటికి భిన్నంగా ఓ పెళ్లికూతురు సాదాసీదాగా టమోటా నెక్లెస్ ను వేసుకుంది. చేతులకు కూడా టమోటా గాజుల్ని పెట్టుకుంది. పాక్‌లో టమాట ధరలు ఆకాశాన్ని అంటడంతో బంగారానికి బదులుగా టమోటాల నెక్లెస్ ధరించానంటోంది ఈ పెళ్లికూతురు. పాకిస్థాన్‌లోని చాలా ప్రాంతాల్లో టమోటా ధరలు కిలో 3 వందల నుంచి 4 వందల రూపాయల ధర పలుకుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేసింది నవ వధువు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.