అమెరికా, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చైనాపై వత్తిడి తెచ్చేందుకు మరోసారి ప్రయత్నం చేసింది. రెండు వారాల క్రితమే అమెరికా ప్రతిపాదనను తన వీటో అధికారంతో చైనా అడ్డుకున్న విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల సహకారంతో అమెరికా.. ఐక్యరాజ్యసమితిలో అజర్ నిషేధంపై వత్తిడి తెస్తున్నది.
భద్రతా మండలిలో ఉన్న 15 సభ్యదేశాలకు బ్రిటన్, ఫ్రాన్స్ సంతకం చేసిన తీర్మానాన్ని అమెరికా సర్క్యూలేట్ చేసింది. అజర్‌పై ట్రావెల్ బ్యాన్ విధించాలని, అతని ఆస్తులను స్తంభింపచేయాలని కోరింది. ఇటీవల జరిగిన పుల్వామాలో దాడిలో తమ పాత్ర ఉన్నట్లు జైషే అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఉగ్రవాదిపై నిషేధం విధించేందుకు అగ్ర రాజ్యం అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది.
జగన్ ఫ్యాన్ స్విచ్ మోదీ వద్ద..రెగ్యులేటర్ కేసీఆర్ వద్ద: నారా లోకేశ్