telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

1000 సిటీ బస్సుల రద్దు.. రాత్రి 11 గంటల వరకు మెట్రో

metro train hyd

హైదరాబాద్ నగరంలో దాదాపు 1000 ఆర్టీసీ బస్సులను టీఎస్ఆర్టీసీ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో మెట్రో రైలు వేళలల్లో మార్పులు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి పేరిట ఓ ప్రకటన విడుదలైంది. ఇకపై రాత్రి 11 గంటలకు మెట్రో చివరి రైలు బయలుదేరుతుందని తెలిపారు.

రాత్రి 11.50 గంటలకు ఆఖరి స్టేషన్ కు రైలు చేరుతుందన్న శుభవార్తను ఆయన ప్రయాణికులకు తెలిపారు. ప్రస్తుతం ఉదయం 6 గంటలకు తొలి రైలు కదులుతుండగా, ఆ సమయాన్ని 6.30కి మార్చినట్టు తెలిపారు. రాత్రి వేళల్లో ఆలస్యంగా ఇళ్లకు చేరుకునే వారికి సౌకర్యంగా ఉండేందుకే సమయాన్ని పెంచినట్టు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

Related posts