telugu navyamedia
సినిమా వార్తలు

నయనతార నుదుటిపై ముద్దు పెట్టిన‌ పెళ్లి ఫొటో షేర్‌ చేసిన విఘ్నేశ్‌..

లేడీ సూప‌ర్ స్టార్ నయనతార- ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది .ఈ జంట పెళ్లి వేడుక సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్య తమిళనాడులోని మహాబలిపురంలోని షెరటాన్ గ్రాండ్ రిసార్ట్ హోటల్ లో హిందూ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి వేడుకలు జరిగాయి.

తాళి కట్టిన తర్వాత నయనతార నుదుటిపై విఘ్నేశ్ శివన్ ముద్దు పెట్టిన‌ తొలి పెళ్లి ఫోటోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

Image

10 స్కేల్‌లో…. ఆమె నయన్ (తొమ్మిది), నేను ఒకటి. భగవంతుడి దయతో… ఈ విశ్వం, మా తల్లిదండ్రులు, స్నేహితుల ఆశీర్వాదాలతో… పెళ్లి చేసుకున్నాం” అని విఘ్నేష్ శివన్ పేర్కొన్నారు. జస్ట్ మ్యారీడ్ హ్యాష్ ట్యాగ్ జోడించారు.

Nayanthara and Vignesh Shivan marriage

ప్రస్తుతం ఈ పోటో వైరల్‌గా మారింది. అది చూసిన సినీ తారలు నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Nayanthara and Vignesh Shivan marriage

ఈ వివాహానికి సూపర్​స్టార్​ రజనీకాంత్, హీరో కార్తి,​ బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్​, దర్శకుడు అట్లీ, విజయ్ సేతుపతి, శివకార్తికేయన్,  నిర్మాత బోనీకపూర్​, మణిరత్నం కూడా హాజరై హాజరయ్యారు.

 

 

Related posts