telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వైఎస్ వివేకా హత్య కేసులో కీలక సాక్షి అనుమానాస్పద మృతి..

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివాకానంద రెడ్డి సంచలనాత్మక హత్య కేసు విచార‌ణ ముమ్మ‌రంగా కొన‌సాగుతుంది. ఈ హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న గంగాధర్‌ రెడ్డి అనే వ్యక్తి అనంతపురం జిల్లా యాడికిలో అనుమానాస్పద రీతిలో మృతి చెంద‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

గతంలో తనపై వైఎస్ వివేకానందరెడ్డి అనుచరులతో పాటు సీబీఐ అధికారులు నుండి తనకు ప్రాణహాని ఉందని ఆరోపణలు చేశారు . అంతేకాదు తనను వేధింపులకు గురి చేస్తున్నారని కూడా చెప్పారు. ఈ విషయమై తనకు సీబీఐ రూ. 10 కోట్లు ఆఫర్ చేసిందని కూడా ఆ ఫిర్యాదులో గంగాధర్ రెడ్డి ఆరోపించారు అనంత‌పురం ఎస్పీ ఫకీరప్ఫకు కూడా పిర్యాదు చేశారు.

కాగా.. గంగాధర్‌ రెడ్డి రాత్రి నిద్రలోనే మృతి చెందినట్లుగా గుర్తించిన కుటుంబ‌స‌భ్యులు..పోలీసుల‌కు స‌మాచారం అందించారు.  అక్క‌డకు చేరుకున్న పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. కుటుంబ స‌భ్యులు ఫిర్యాదు మేర‌కు అనుమానాస్పద మృగా కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

అంతేకాకుండా  క్లూస్‌టీం ర‌ప్పించి గంగాధర్‌ రెడ్డి ఇంటి చుట్టుపక్కల కూడా పరిశీలన జరుపుతున్నారు. తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి గంగాధర్ రెడ్డి మృతదేహాన్ని తరలించారు.

Related posts