నయనతార దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్. సినిమాలో ఒక పాత్ర ఇస్తే ఆ పాత్రకు ప్రాణం పోసే అద్భుత నటి. ఆమె ఇది వరకు చేసిన ప్రతి సినిమాలో నయనతార నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. నయనతార అటు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు, ఇటు గ్లామర్ రోల్స్ తో దూసుకెళ్తోంది. స్టార్ హీరోయిన్‌గా కోలీవుడ్‌లో నయనతార స్థానం పదిలం. మరోవైపు భారీ బడ్జెట్ సినిమాల్లోనూ నటిస్తూ భారీ క్రేజ్ ను మూటగట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం ఇటు తెలుగు, అటు తమిళంలో బిజీగా ఉన్న హీరోయిన్లలో ఒకరు. నయనతార చిట్టిపొట్టి డ్రస్సులకు, బికినీలకు, ముద్దుసీన్లకు సై అంటోందట! నాలుగైదేళ్ళ నుంచి ఈ భామ వాటికి దూరంగా ఉంటోంది. అలాంటి కథలతో వచ్చేవారి మాటలు కూడా వినేది కాదు. అలాంటిది. పై వాటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. కథ డిమాండ్ చేస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. నయనలో ఈ మార్పును చూసి దర్శకనిర్మాతలు పండగ చేసుకుంటున్నారట. ఎందుకంటే….ప్రస్తుతం స్టార్ హీరోయిన్ అనదగిన వారిలో నయనతార తప్ప ఎవరూ లేరు. అలాంటి నయనతారతో బికినీలు వేయించి ముద్దు సీన్లు పెడితే సినిమా సూపర్ డూపర్ హిట్ కావడం ఖాయమని అంటున్నారట. నయనతార ఇప్పుడు ఈ నిర్ణయానికి కారణం ఆమెకు సినిమాలు లేకపోవడమే అంటున్నారు.
previous post
అమ్మాయిలు రేప్ కు సహకరించాలి… దర్శకుడి సంచలన వ్యాఖ్యలు