telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

కుప్పకూలిన ప్రహరి గోడ.. ముగ్గురు చిన్నారులు మృతి

New couples attack SR Nagar

హైదరాబాద్ నగరంలో ప్రహరి గోడ కూలి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ విషాద ఘటన హబీబ్ నగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. మంగర్ బస్తీలోని అఫ్జల్ సాగర్ వీధిలో ప్రహరీ గోడ హఠాత్తుగా కుప్పకూలి ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురు చిన్నారులపై పడింది. ఈ ఘటనలోఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు.. రోషిని (6) , పావని (4), సారిక (4) మృతి చెందారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ బృందం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. చిన్నారుల మృతితో వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. హాబీబ్ నగర్ పోలీసులు, క్లూస్ టీమ్ చిన్నారుల మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై విచారణ పోలీసులు జరుపుతున్నారు.

Related posts