telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జానారెడ్డి వయసుపై మంత్రి జగదీష్‌ రెడ్డి కామెంట్‌..!

నాగార్జున సాగర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మృతి తర్వాత.. అన్ని పార్టీల ఫోకస్‌ సాగర్‌ ఉప ఎన్నికపైనే పడ్డాయి. దీంతో అన్ని పార్టీల నాయకులు సాగర్‌ బాట పట్టారు. ఇటీవలే స్వయంగా సీఎం కేసీఆర్‌ గారే హలీయాలో బహిరంగ సభ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు జానారెడ్డిపై మంత్రి జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఇవాళ హలీయాలో మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… మాటల్లో, ప్రజా సమస్యల పరిష్కారంలో పెద్దరికం ఉండాలని.. వయస్సులో కాదని జానారెడ్డికి చురకలు అట్టించారు. జానారెడ్డి 35 ఏళ్ళ రాజకీయ జీవితంలో చేసిన నిర్వాకం ప్రజలందరికీ తెలుసు అని గుర్తుచేశారు. జానారెడ్డి తనకు తాను పెద్ద నాయకున్ని అని ఊహించుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. 2018లోనే సాగర్ ప్రజలు జానారెడ్డికి సరైన సమాధానం చెప్పి ఇంటికి పంపారని… ఈ విషయాన్ని జానారెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్‌ నాయకులు జిల్లాను ఏ విధంగా భ్రష్టు పట్టించారో, ఏ విధంగా ఫ్లోరైడ్ మహమ్మారిని జిల్లా మెత్తం విస్తరించేలా చేసారో ప్రజలకు తెలుసు అని పేర్కొన్నారు మంత్రి జగదీష్‌ రెడ్డి. 60 ఏళ్ళ కాంగ్రెస్‌ పాలనలో చేసిన నిర్వాకాన్ని, ఈ ఆరున్నర ఏళ్ళలో సీఎం కెసీఆర్ నాయకత్వంలో చేసిన అభివృద్దిని చర్చించేందుకు ప్రతి టీఆర్‌ఎస్‌ కార్యకర్త సిద్దంగా ఉన్నారని తెలిపారు. చర్చకు రమ్మంటే… జానారెడ్డి వెనకడుగు వేస్తున్నాడని.. చర్చలకు తన స్థాయి నాయకులు లేరని బుకాయిస్తున్నాడని మండిపడ్డారు.

Related posts