2019-2020 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏపీ, తెలంగాణ ప్రజలకు నిరాశే ఎదురైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని యూనివర్సిటీలకు మంత్రి సీతారామన్ నామమాత్రపు కేటాయింపులు చేశారు. ఎప్పటిలాగానే బడ్జెట్‌పై తెలుగు రాష్ట్రాలు గంపెడాశలు పెట్టుకున్నాయి. ఈ ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఏపీలోని సెంట్రల్ వర్సిటీకి రూ.13 కోట్లు, అలాగే ఏపీ ట్రైబల్ వర్సిటీకి రూ. 8 కోట్లు కేటాయించారు. ఇక తెలంగాణలోని హైదరాబాద్ ఐఐటీకి రూ. 80 కోట్లు కేటాయించారు.
ఏపీలో ట్రిపుల్ ఐటీలు, నిట్, ఐఐఎం, ఐఐటీలకు ఒక్క పైసా కూడా కేటాయించలేదు. దీంతో, వీటి నిర్వహణ మొత్తం రాష్ట్ర ప్రభుత్వంపై పడే అవకాశం ఉంది. ఏపీలోని ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణం తదితర అంశాల ఊసు కూడా బడ్జెట్ లో లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ ఏపీ ప్రజలు పెదవి విరుస్తున్నారు.
ప్రజల జీవితాలతో “కేసీఆర్ అండ్ కో” ఆడుకుంటున్నారు: విజయశాంతి