telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషి చాలా గొప్పది: చంద్రబాబు

chandrababu

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 ప్రయోగం చివరి నిమిషంలో విఫలమైన సంగతి తెలిసిందే. చంద్రుడిపై ల్యాండర్ “విక్రమ్” 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా, ఒక్కసారిగా సిగ్నల్స్ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ట్విటర్ లో స్పందించారు. ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషి మాత్రం చాలా గొప్పదని అన్నారు.

మన శాస్త్రవేత్తలను చూసి యావత్‌ భారత్‌ గర్విస్తోందన్నారు. ఈ క్లిష్ట సమయంలో యావత్‌ దేశం ఇస్రో బృందానికి అండగా ఉందన్నారు. ల్యాండర్ విక్రమ్ విషయంలో ఆఖరి క్షణంలో అవరోధం ఎదురైనా ఇప్పటివరకూ సాధించింది తక్కువేమీ కాదని అభిప్రాయపడ్డారు. ఇస్రో శాస్త్రవేత్తల అసాధారణ కృషికి అభినందనలు అని ట్వీట్ చేశారు. 

Related posts