telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

మామిడికాయ.. గొప్పతనం తెలుసా!

Mango fruits

మామిడిపండు 

మంచి వేసవిలో పండు మామిడి భలే నోరూరిస్తాది

నోటికి తియ్యగా ,మెత్తగా ,కమ్మగా తినేలా చేస్తాది

చూసే కనులను తనవైపు మలచుకుంటాది

చిన్నవాళ్ళని లేదు

పెద్దవాళ్ళని లేదు

అందరికీ ఈ పండు భలే భలే 

ఇష్టమైన పండనిపిస్తాది

పచ్చటి మామిడి కొమ్మకి

పసుపు పచ్చటి చీరను కట్టినట్టుగా

లోపల జిలేబీ రసాన్నీ నింపుకుని

వయసుకి వచ్చిన పడుచు 

అందపు గంధం పులుముకుని

పరువానికి వచ్చిన సొగసరి వన్నెలాగా

కొంటె కుర్రవాళ్ళ కంటికి చిక్కితే

కన్నుగీటే కవ్వింపులాగా

ఈ_పండు భలే తయారైనది

ఇంద్రధనుస్సులో రంగులు మనల్ని 

ఎలా మైమరపింప చేస్తాయో

ఈ_మామిడిలో కూడా రకాలు మనల్ని

భలే రుచికరంగా తినేలాచేస్తాయి

ఒక్కో రకం ఒక్కో 

రుచిని కలిగి ఉంటూ

మళ్ళీ_తన_కాపు_కోసం_తన_రాకకోసం

అందరినీ_ఎదురుచూసేలా_చేస్తుంది 

ఈ_మామిడిపండు

 

Related posts