telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కొత్త ఏడాది అందర్నీ ఆశ్చర్యపరించిన కిమ్‌ జాంగ్‌ ఉన్‌…

ప్రపంచంలో అగ్రరాజ్యం గా కొనసాగుతున్న అమెరికాను సైతం వణికించేవాడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌. తన దేశంలో కఠిన నియమాలను అమలు చేస్తూ ఉంటాడు. అయితే కొత్త సంవత్సరం సందర్భంగా ఉత్తర కొరియాలో అరుదైన సంఘటన జరిగింది. కరోనా కష్ట కాలంలో తనను నమ్మి, సహకరిస్తున్నారంటూ దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు కిమ్‌ జాంగ్‌ ఉన్‌. దేశ ప్రజల ఆశయాలు, కోరికలు నిజరూపం దాల్చేందుకు,  కొత్త శకాన్ని ఆరంభించేందుకు తాను ఈ నూతన సంవత్సరంలో కూడా మరింత కృషి చేస్తానన్నారు. కిమ్‌ సందేశంతో కూడిన రెండున్నర కోట్ల లేఖలను ప్రజలకు అందించారు అక్కడి అధికారులు. సాధారణంగా నూతన సంవత్సరం తొలి రోజు టీవీలో ప్రసంగిస్తారు కిమ్‌ జాంగ్‌ ఉన్‌. ఐతే ఈ సారి ఆ సంప్రదాయానికి  విరుద్ధంగా తన సందేశాన్ని బహిరంగ లేఖల రూపంలో విడుదల చేయటం విశేషం. ఓ ఉత్తర కొరియా నేత ఈ విధంగా సందేశాలను విడుదల చేయటం 1995 తర్వాత ఇదే తొలిసారి. కిమ్ ఇలా చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దాంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.

Related posts