telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రభుత్వాల వైఫల్యం వల్లే యూరియా కొరత: రేవంత్ రెడ్డి

Revanth-Reddy mp

తెలంగాణలో యూరియా కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేత, లోక్ సభ సభ్యుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్లే తెలంగాణలో యూరియా కొరత తలెత్తిందని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చాలా దుర్భరమైన స్థితిలో ఉందని రేవంత్ రెడ్డి విమర్శించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ ఎరువులు అందక రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ఇతర వ్యవసాయ శాఖ ఆఫీసుల ముందు భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారని తెలిపారు.ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు ప్రతీ జిల్లాకు ఓ ఐఏఎస్ అధికారిని స్పెషల్ ఇన్ చార్జీగా నియమించాలని సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న విపత్కర పరిస్థితిని వెంటనే సరిదిద్దాలని సూచించారు.

Related posts