telugu navyamedia
రాజకీయ

మనోహరా …. జాతి మరువదు  రా ..!

Manohara Jati Maravadhu Ra Best Teluug Poetry
మనోహర్ గోపాలకృష్ణ  ప్రభు పారీకర్ 
భారత రాజకీయాల్లో చెరిగిపోని పేరు 
మచ్చలేని నాయకుడు , స్వచ్ఛమైన  ప్రజాసేవకుడు 
సామాన్యుడు , మాన్యుడు,సౌమ్యుడు , సజ్జనుడు 
నిరాడంబరుడు , నిగర్వి , నిఖార్సైన మానవతావాది 
పారీకర్ మృతి  దేశాన్ని కదిపేస్తుంది 
నిస్వార్ధ నాయకుడు మరణం కుదిపేస్తోంది 
గంజాయివనంలో తులసి మొక్క 
రాజకీయరంగంలో పరిమళాల గంధపు చెక్క 
పేద కుటుంబంలో  పుట్టిన ఆణిముత్యం 
దేశ ప్రజల మనస్సుల్లో వెలిగిన మణి దీపం 
ఆర్ ఎస్ ఎస్ లో పాఠాలు నేర్చుకున్న విద్యార్థి 
భారతీయ జనతా పార్టీ మరువలేని అభ్యర్థి 
తొలి రాజకీయప్రవేశం ఓటమి నుంచి రాటుతేలాడు 
మలి  పోరాటం విజయంగా చివరివరకు వెన్నంటి ఉంది 
నాలుగు సార్లు గోవా ముఖ్యమంత్రిగా ప్రస్థానం 
దేశ రక్షణ మంత్రిగా  సంస్కరణల  ప్రయాణం 
పాలనలో తనదైన ముద్ర వేసిన ప్రతిభాశాలి 
అవినీతి రహిత సేవకుడైన ప్రభావశీలి 
పదవి ఏదైనా ప్రజల కోసం జీవించాడు 
ప్రజలలో ఒకడిగా  మమేకమై పోయాడు 
గోవా ప్రజల గుండెల్లో దీపమై వెలుగుతున్నాడు 
దేశ ప్రజలు మనస్సుల్లో చెరిగిపోని రూపంగా  మిగిలిపోయాడు 
మనోహర్ మరువదు  నిను ఈ జాతి 
రాజకీయ నాయకుడుగా నీవు నేర్పిన నీతి 
నిత్యమై , సత్యమై  ధరణిలో నిలుస్తుంది నీ ఖ్యాతి 
నీ కీర్తి చిరస్మరణీయం .. 
నీ స్ఫూర్తి అనుసరనీయం 
-భగీరథ 

Related posts