telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

కత్తిపోటుకు గురైన 8 నెలల గర్భవతి… బిడ్డ…

London

ఎనిమిది నెలల గర్భంతో ఉన్న కెల్లీ మేరీ అనే 26 ఏళ్ళ యువతిని కత్తితో పొడవడంతో ఆమె వెంటనే కార్డియాక్ అరెస్ట్‌కు గురైంది. ఆసుపత్రికి తీసుకెళ్లి ఆమె ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నించినప్పటికీ డాక్టర్ల ప్రయత్నాలు ఫలించలేదు. అయితే ఆమె కడుపులో ఉన్న శిశువును మాత్రం డాక్టర్లు డెలివరీ చేసి బయటకు తీశారు. ప్రస్తుతం ఆ శిశువు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి మొదటగా ఓ వ్యక్తిని అరెస్ట్ చేశామని, అయితే తరువాత ఈ దాడికి పాల్పడింది మరొక వ్యక్తి అని తెలియడంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. మరొకసారి ఇలాంటి క్రూర సంఘటనలు జరగకుండా చూస్తామంటూ పోలీసులు హామీ ఇస్తున్నారు. యువతి మరణం పట్ల లండన్ మేయర్ సదిఖ్ ఖాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుండగుడు ఇంతటి దారుణానికి ఎందుకు పాల్పడ్డాడో తెలియాల్సి ఉంది. శనివారం లండన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Related posts