telugu navyamedia
క్రీడలు వార్తలు

ఇండియాలో మూడో వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్…

corona vacccine covid-19

ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ ఏడాది ఆరంభం నుండి భారత్ లో రెండు కరోనా వ్యాక్సిన్ లు అందుబాటులోకి వచ్చాయి. అయితే తాజాగా దేశంలో మూడో టీకా కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. స్పుత్నిక్ టీకాకు ఆమోదం కేంద్రం ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో అందుబాటులోకి రానుంది రష్యా వ్యాక్సిన్. దేశంలో టీకా కొరత వేధిస్తోంది. దీంతో స్ఫుత్నిక్‌కు ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వం. రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతుండటం, వివిధ రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ కొరత ఉండటంతో మరో ఐదు వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వాలని కేంద్రం భావించింది. ఇందులో భాగంగా రష్యా అభివృద్ధి చేసిన చేసిన ‘స్పుత్నిక్‌-వి’ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగం కోసం కేంద్ర నిపుణుల కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. త్వరలోనే టీకా ఉత్పత్తి చేసి, వినియోగంలోకి తీసుకురానున్నారు. అయితే మన దేశంలో వ్యాక్సినేషన్ జరుగుతూనే ఉన్న కేసులు మాత్రం తగ్గడం లేదు. దాంతో అందరిలోనూ కొంత భయం మొదలయ్యింది.

Related posts