తెలంగాణ ఏసీబీ ప్రత్యేక కోర్టు రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్ లావణ్యను కస్టడీకి అనుమతించింది. ప్రత్యేక కోర్టు తహసీల్దార్ లావణ్యను రెండ్రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అనుమతించింది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు లావణ్యను విచారించనున్నారు. ప్రస్తుతం ఆమె చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఏసీబీ అధికారులు లావణ్యను రేపు కస్టడీకి తీసుకోనున్నారు.
ఆన్‌లైన్‌లో పేరు నమోదుకు ఓ రైతు నుంచి 4 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ వీఆర్వో అనంతయ్య అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. రైతు నుంచి రూ.9 లక్షలు డిమాండ్ చేసిన అనంతయ్య.. అందులో రూ.5 లక్షలు తహశీల్దార్ లావణ్య వాటా అని వివరించాడు.వీఆర్‌వో ఇచ్చిన సమాచారం ఆధారంగా తహసీల్దార్ ఇంట్లో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు ఏకంగా రూ.93 లక్షల అక్రమ నగదును పట్టుకున్న విషయం తెలిసిందే.
తెలంగాణలో బీజేపీ కార్యకర్తలపై దాడులు: ఎంపీ బండి సంజయ్