telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

డెడ్ లైన్ దాటింది కొందరే.. సమ్మెకే ఆర్టీసీ సుముఖత ..

tsrtc union president aswathamareddy on kcr

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె పరిష్కారం తో పాటుగా కార్మికులకు కేసీఆర్ డెడ్ లైన్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ అర్ధరాత్రితో ఆ డెడ్ లైన్ ముగుస్తుంది. అయినప్పటికి తాము సమ్మెలోనే కొనసాగుతామని కార్మికులు ఘంటాపధంగా తెలియజేస్తున్నారు. ఈరోజు అర్ధరాత్రి 12 గంటల వరకు ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరడానికి కేసీఆర్ గడువు విధించారు. ఈ డెడ్‌లైన్ వల్ల ఇప్పటివరకు దాదాపు 208 మంది ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఈ నెల 2న ప్రెస్ మీట్ పెట్టి డెడ్‌లైన్ విధించగా.. 3వ తారీఖున 17 మంది, 4 వ తేదీన ఆ సంఖ్య 34కు చేరుకోగా.. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 157 మంది సదరు డిపోల వద్ద దరఖాస్తులను అప్పగించినట్లు అధికారులు చెబుతున్నారు.

ఈ గడిస్తే కేసీఆర్ పంతం నెగ్గుతుందా. ? కార్మికుల పట్టుదల పనిచేస్తుందా అన్న ఉత్కంఠ యావత్ తెలంగాణలో వ్యక్తమవుతుంది. ఈరోజు కార్మికులు కనుక విధుల్లో చేరకపోతే మొత్తం ప్రైవేటీకరణ చేస్తానన్న కేసీఆర్ రేపు ఏం చేస్తారన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఆర్టీసీ నష్టాల్లో వాటా కోసం కేంద్రం ఎలాగో ముందుకు రాదు కాబట్టి.. ఈ అంశాన్ని లేవనెత్తడం ద్వారా బీజేపీ నేతలు మాట్లాడకుండా చూడొచ్చనేది సీఎం వైఖరిలా ఉంది. మరి 31 శాతం వాటా ఉన్న కేంద్రాన్ని సంప్రదించే ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీసీ విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నాయా? అని ప్రశ్నిస్తే.. సమాధానం లేదనే వస్తుంది. అలాంటప్పుడు మీరు చేసిన తప్పిదాలకు మేమెలా డబ్బులు ఇవ్వాలని కేంద్రం తిరిగి ప్రశ్నించే అవకాశం లేకపోలేదు, బహుశా కేసీఆర్ కి కూడా అదే కావాలి, అప్పుడే ఆయన అనుకున్నది చేసితీరుతాడు!

Related posts