telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

Modi

భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు నేడు (సెప్టెంబర్ 17).  ఈ  సందర్భంగా శుభాకాంక్షలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. సినీ, రాజకీయ ప్రముఖులు, బీజేపీ లీడర్స్ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ రోజుతో 69 వసంతాలు పూర్తిచేసుకొని 70వ వసంతంలోకి అడుగుపెట్టారు మోదీ. ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఆయనకు విష్ చేస్తూ ఓ సందేశం పోస్ట్ చేయడంతో దానిపై వెంటనే రియాక్ట్ అవుతూ ఆకట్టుకున్నారు మోదీ. ”గౌరవనీయులైన ప్రధాని నరేంద్రమోదీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ అసాధారణ నాయకత్వ లక్షణాలతో భారత దేశాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నా” అంటూ పోస్ట్ చేశారు మహేష్. మహేష్ పెట్టిన ఈ ట్వీట్‌పై రియాక్ట్ అయిన ప్రధాని మోదీ.. ”దేశంలో వచ్చిన ఈ మార్పు భారతీయ పౌరుల సహకారం వల్లే సాధ్యమైంది. దేశ ప్రజలందరి సపోర్ట్, పార్టిసిపేషన్ ద్వారానే మనం ముందుకెళ్తున్నాం. వారికి సేవ చేసే భాగ్యం కలగడం నా అదృష్టం” అని పేర్కొన్నారు.

Related posts