బంగ్లాదేశ్‌తో టెస్ట్, టీ20 సిరీస్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి టీ20 సిరీస్‌కు విశ్రాంతి కల్పించారు. కోహ్లీ ఆఖరిసారి ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో చివరి రెండు వన్డేలతో పాటు టీ20 సిరీస్‌లో విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత ఏకబిగువుగా మ్యాచ్‌లు ఆడుతున్నాడు. కోహ్లీకి విశ్రాంతి నేపథ్యంలో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు బిసిసిఐ బోర్డు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అలాగే విజరు హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీతో సత్తా చాటిన కేరళ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ సంజు శాంసన్‌కు జాతీయ జట్టులోకి మళ్లీ పిలుపు వచ్చింది.
ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా స్థానంలో ముంబయి క్రికెటర్ శివమ్ దూబే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయనున్నాడు. టెస్టు జట్టులో మాత్రం ఎలాంటి మార్పులో చోటు చేసుకోలేదు. దక్షిణాఫ్రికాతో తలపడిన భారతజట్టునే కొనసాగించారు. రాంచీ టెస్ట్‌లో అరంగేట్రం చేసిన షాబాద్ నదీమ్‌కు మాత్రం బంగ్లాదేశ్‌తో తలపడే భారతజట్టులో చోటు దక్కలేదు. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ నవంబర్ 3 నుంచి, టెస్ట్ సిరీస్ 14నుంచి ప్రారంభం కానుంది.